Ameesha Patel Gets Bail: మళ్లీ అదే తప్పు చేసి కోర్టులో లొంగిపోయిన టాప్ హీరోయిన్!

Ameesha Patel Gets Bail in Cheque Bounce Case: అమీషా పటేల్ మళ్లీ వార్తల్లోకెక్కింది. త్వరలోనే గదర్ 2 సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్.. అంతకంటే ముందుగా ఒక పాత చెక్ బౌన్స్ కేసులో ఇవాళ జార్ఖండ్ లోని రాంచి సివిల్ కోర్టు ఎదుట లొంగిపోయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 19, 2023, 08:18 PM IST
Ameesha Patel Gets Bail: మళ్లీ అదే తప్పు చేసి కోర్టులో లొంగిపోయిన టాప్ హీరోయిన్!

Ameesha Patel Gets Bail in Cheque Bounce Case: అమీషా పటేల్ మళ్లీ వార్తల్లోకెక్కింది. త్వరలోనే గదర్ 2 సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్.. అంతకంటే ముందుగా ఒక పాత చెక్ బౌన్స్ కేసులో ఇవాళ జార్ఖండ్‌లోని రాంచి సివిల్ కోర్టు ఎదుట లొంగిపోయింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన అమీషా పటేల్ తరపున ఆమె న్యాయవాది బెయిల్ కోసం దరఖాస్తు చేయగా.. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అమీషా పటేల్‌కి షరతులతో కూడిన బెయిల్‌ని మంజూరు చేశారు.

అమీషా పటేల్ ని కోర్టు వరకు రప్పించిన ఈ చెక్ బౌన్స్ కేసు వివరాల్లోకి వెళ్తే.. 2018 లో రాంచిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన అమీషా పటేల్ కి అక్కడ అజయ్ కుమార్ సింగ్ అనే బిజినెస్ మేన్ తో పరిచయం ఏర్పడింది. అప్పటికే హీరోయిన్ నుంచి నిర్మాత అవతారం ఎత్తిన అమీషా పటేల్.. హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటీనే మరోవైపు నిర్మాతగా సినిమాలు చేస్తోంది. 

ఈ క్రమంలోనే అజయ్ కుమార్ సింగ్ తో కలిసి ఒక సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేశారు. అజయ్ కుమార్ సింగ్ కి లవ్లీ వరల్డ్ ఎంటర్ టైన్మెంట్ పేరిట అప్పటికే ఒక చిత్ర నిర్మాణ సంస్థ నడుస్తోంది. దీంతో ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమాను నిర్మించినప్పటికీ.. కొన్ని అనుకోని కారణాలతో ఆ సినిమా విడుదల కాకుండానే ఆగిపోయింది.

ఇది కూడా చదవండి: Father's Day 2023 Gifts Ideas: ప్రియమైన నాన్నకు.. డాడీని సర్‌ప్రైజ్ చేయండిలా..

తమ సినిమా ఆగిపోవడంతో తన డబ్బు తనకి వెనక్కి తిరిగివ్వాల్సిందిగా అజయ్ కుమార్ సింగ్ అమీషా పటేల్ పై ఒత్తిడి తీసుకొచ్చాడు. అజయ్ కుమార్ చేసిన ఒత్తిడి తట్టుకోలేని అమీషా పటేల్ అతడికి 2.50 కోట్ల రూపాయలకు గాను చెక్ ఇచ్చింది. కానీ ఆ చెక్ బౌన్స్ అవడంతో అజయ్ కుమార్ సింగ్ కోర్టుకి వెళ్లాడు. ఈ కేసులోనే తాజాగా రాంచి కోర్టు ఆదేశాల మేరకు ఆమె కోర్టులో విచారణకు హాజరైంది. అమీషా పటేల్‌కి చెక్ బౌన్స్ కేసు కొత్తేం కాదు.. యూటీఎఫ్ టెలిఫిలింస్ అనే మరో నిర్మాణ సంస్థకు సైతం 32.25 లక్షలకు అమీషా పటేల్ చెక్ ఇవ్వగా ఆ చెక్ కూడా బౌన్స్ అయింది. ఈ కేసులోనూ అమీషా పటేల్ విచారణ ఎదుర్కొంటోంది.  

ఇది కూడా చదవండి: Adipurush Collections: ఆదిపురుష్ మూవీ టీమ్‌కు షాక్.. అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు క్యాన్సిల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News