Allu Arjun: ఇండియా..తగ్గేదే లే.. వైరల్ అవుతున్న బన్నీ ఎమోషనల్ స్పీచ్

Allu Arjun: మొన్నటివరకూ విభిన్నమైన పుష్ప మేనియాతో ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు అద్భుతమైన స్పీచ్‌తో అందరి మనసులు గెల్చుకుంటున్నాడు. పుష్ప ఇచ్చిన భావోద్వేగపు స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 13, 2022, 08:38 PM IST
Allu Arjun: ఇండియా..తగ్గేదే లే.. వైరల్ అవుతున్న బన్నీ ఎమోషనల్ స్పీచ్

Allu Arjun: పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం కల్గించిన దక్షిణాది సూపర్ స్టార్ నటుడు అల్లు అర్జున్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. సినిమాలో తనదైన మేనియాతో ఆకట్టుకున్న అల్లు అర్జున్..ఈసారి అద్భుతమైన మాటలతో అందరి మనసస్సులు గెల్చుకున్నాడు.

ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఇప్పుడు వార్తల్లో ఉన్నారు. హిందీ, దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు వేగంగా వైరల్ అవుతున్నాయి. అందరి మనస్సుల్ని గెల్చుకుంటున్నాయి. 20 ఏళ్లలో తొలిసారిగా ప్రతిష్ఠాత్మక అవార్డు తీసుకుంటూ అల్లు అర్జున్ భావోద్వేగమయ్యాడు. అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్‌పై పెద్దఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. అల్లు అర్జున్ కు ఓ వేడుకలో లభించిన గౌరవం అతడి మాటల్లో ప్రతిబింబించింది. అల్లు అర్జున్‌కు ఈ గౌరవం 20 ఏళ్లలో తొలిసారిగా దక్కింది. అందుకు స్పందనగా ఇండియా ఎప్పటికీ తల వంచదంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం

దక్షిణాది సుప్రసిద్ధ నటుడు అల్లు అర్జున్‌కు ఇటీవల న్యూ ఢిల్లీలో పుష్ప సినిమాకై ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డుతో సన్మానించారు. ఈ అవార్డు తీసుకున్న ఆనందంలో అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా చేసిన ఎమోషనల్ స్పీచ్ చాలా వేగంగా వేరల్ అవుతోంది. 

ఇండియా ఎప్పటికీ తల వంచదు-అల్లు అర్జున్

గత 20 ఏళ్ల నుంచి యాక్టింగ్ చేస్తున్నాను కానీ ఉత్తరాదిలో దక్షిణాది సినిమాకు సంబంధించి ఇలా సన్మానించడం ఇదే తొలిసారి. అందుకే అవార్డు తీసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ మాటల్లో..

ఉత్తరాది, దక్షిణాది అంటూ మన మధ్య బేధాభిప్రాయాలున్నా..ఈ దేశపు ప్రత్యేకతే భిన్నత్వం. ఈ సినిమా నిర్మించినప్పుడు మొత్తం దేశమంతా వేడుక చేసుకుంది. అందుకే మనమంతా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కొడుకులు, కుమార్తెలు.

ఇండియన్ సినిమా...ఇండియా ఎప్పటికీ తల వంచదు అని పుష్ప మేనియాతో ముక్తాయించాడు.

Also read: Mahesh Babu London: షూట్ ఆపేసి మరీ విదేశాలకు మహేష్ బాబు.. అందుకేనంటూ ప్రచారం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News