Allu Aravind: సినీ పరిశ్రమ తరపున కాంగ్రెస్ వారిని కలుస్తాం... అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు

Allu Aravind About Congress: తెలంగాణలో 10 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న కేసీఆర్ గడువు నిన్న ఎలక్షన్స్ కౌంటింగ్ తో ముగిసిపోయింది. ఇక నిన్న ఎలక్షన్స్ లో తెలంగాణలో కాంగ్రెస్ గెలవగా.. కాంగ్రెస్ గురించి అలానే సినీ పరిశ్రమ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత అల్లు అరవింద్.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2023, 06:32 PM IST
Allu Aravind: సినీ పరిశ్రమ తరపున కాంగ్రెస్ వారిని కలుస్తాం... అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు

Allu Aravind About Congress: తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్న కొద్దిమంది నిర్మాతలలో అల్లు అరవింద్ ఒకరు. సినిమా పరిశ్రమకు ఏదన్నా సమస్య వచ్చిన.. వెంటనే రియాక్ట్ అయ్యే వాళ్ళల్లో కూడా ఒకరు. ఎలాంటి విషయం అయినా మీడియా ముందుకు వచ్చి నిర్భయంగా తన అభిప్రాయం చెబుతూ ఉంటారు ఈ నిర్మాత. గీత ఆర్ట్స్ తరఫున ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్లు అందించిన అల్లు అరవింద్  ప్రస్తుతం కూడా టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.

కాగా నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు రావడంతో.. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మారి  కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడనుంది. అయితే కాంగ్రెస్ విజయం, ప్రభుత్వ మార్పుతో సినీ పరిశ్రమలో కూడా చర్చలు మొదలయ్యాయి. గవర్నమెంట్ మారడంతో ఇకపై సినీ పరిశ్రమ ఎలా ఉందనుంది? కొత్త గవర్నమెంట్ ఏమన్నా మార్పులు తీసుకొస్తారా ? సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారాలు ఎలా ఉండనున్నాయి? సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఎవరు? ఎప్పటినుంచో డిబేట్ సాగుతున్న నంది అవార్డులను మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తారా అనే పలు ప్రశ్నలు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గురించి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు కాంగ్రెస్ విజయానికి సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా కాంగ్రెస్ గెలుపుపై స్పందించారు. ఈరోజు ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్న ఈ నిర్మాత ఆ ఈవెంట్ ముగిశాక మీడియాతో ముచ్చటించారు.

ఇందులో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడం గురించి మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త ఏమీ కాదు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ఎంతో ప్రోత్సహించాయి. అలానే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. త్వరలోనే సినీ పరిశ్రమ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం' అని తెలియజేశారు అల్లు అరవింద్.

Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 

 

Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News