Nagarjuna Diet: ఇన్నేళ్లకు గ్లామర్ సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున..

Akkineni Nagarjuna: సంక్రాంతికి నా సామిరంగా సినిమాతో వచ్చిన నాగార్జున.. అక్కినేని అభిమానులకు ఒక మంచి పండగ ట్రీట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వయసులో కూడా ఆయన ఇంత అందంగా ఎలా కనిపిస్తారు అనే విషయం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టాడు మన మన్మధుడు…  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2024, 12:31 PM IST
Nagarjuna Diet: ఇన్నేళ్లకు గ్లామర్ సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున..

Nagarjuna Glamour Secret: ఆరు పదుల వయసు దాటిన ఇంకా చూడడానికి మాత్రం మూడు పదుల వయసులోనే నిలిచిపోయారు నాగార్జున. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కింగ్.. మన్మధుడు.. యువర్ గ్రీన్ హీరో.. ఇలాంటి పేర్లు వింటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు నాగార్జున. మరి ఈ అక్కినేని హీరో ఇంత యంగ్ గా కనిపించడానికి కారణం ఏమయింటుందని ఎంతోమందిలో సందేహాలు ఉన్నాయి. ఇక ఈ ప్రశ్నకు జవాబు ని ఈ మధ్య తన కొత్త చిత్రం నా సామిరంగా ప్రమోషన్స్లో బయట పెట్టేశారు మన అక్కినేని హీరో.

సంక్రాంతి అంటే నాగార్జునకి చాలా సెంటిమెంట్. అందుకే సంక్రాంతికి తప్పకుండా తనది ఏదో ఒక సినిమా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నాగార్జునకి సోగ్గాడే చిన్నినాయన..బంగార్రాజు లాంటి సూపర్ హిట్లు ఇచ్చింది కూడా ఈ సంక్రాంతి సీజనే. ఇక అదే సెంటిమెంట్ ఫాలో అవుతూ ఈ సంక్రాంతికి కూడా నా సామిరంగా అనే సినిమాతో మనం ముందుకు వచ్చారు. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా సెలబ్రేషన్స్ లో పాల్గొంటూ.. నాగార్జున తన అందం గురించి ఎదురైనా ఇంట్రెస్టింగ్ క్యూస్షన్ కి జవాబు ఇచ్చేశారు. కీరవాణితో నాగార్జున ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా..కీరవాణి.. మీరు ఇప్పటికి ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటి? రాత్రి పూట తినరా? రైస్ తింటారా? అని అడిగారు.

ఈ ప్రశ్నకు మన మన్మధుడు సమాధానమిస్తూ.. ‘నేను అన్ని తింటాను. కాకపోతే వైట్ రైస్ ఒక్కటి తినను. దాని బదులు బ్రౌన్ రైస్ తింటాను. అందులోకి ఆకు కూరలు, కూరగాయలు అన్ని తింటాను. పచ్చడి కూడా తింటాను..నాన్ వెజ్ కూడా ఫుల్ గా తింటాను. షూటింగ్ లో చేపల పులుసు అక్కడే పట్టి అక్కడే చేయించుకొని మరి తింటాను. ఫుడ్ పరంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ నేను పెట్టుకోను. రాత్రి పూట మాత్రం ఎర్లీగా తింటాను. కనీసం 7 గంటల లోపే తినేస్తాను. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం స్వీట్ కచ్చితంగా తింటాను. ఓ రెండు రౌండ్స్ వేసుకుంటాను. ఇవన్నీ ఫుల్ గా తిన్నా ఉదయం ఫుల్ గా వర్కౌట్స్ చేస్తాను. 35 ఏళ్లుగా నేను ఇదే ఫాలో అవుతున్నాను. పొద్దున్నే ఎక్కువగా వర్కౌట్స్ చేస్తాను. మనం తిన్నది అంతా ఎనర్జీ కింద మారిపోవడానికి' అని తన అందం సీక్రెట్ బయటపెట్టారు మన కింగ్. 

Also Read: IND vs AFG 02nd T20I Live: కోహ్లీ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్లు ఇవే..!

Also Read: Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News