AK 62 Project Cancelled : గెలికిన అజిత్.. హర్టైన నయనతార భర్త విఘ్నేశ్ శివన్

AK 62 Project Cancelled అజిత్ తెగింపు సినిమాతో ఈ సంక్రాంతి బరిలోకి వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. తెలుగులో ఆడకపోయినా తమిళంలో ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు అజిత్ 62వ సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 10:29 AM IST
  • అజిత్ సినిమా నుంచి విఘ్నేశ్ శివన్ అవుట్
  • నయన్ భర్త విఘ్నేష్‌కు చేదు అనుభవం
  • ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్ట్.. కారణం అదేనా?
AK 62 Project Cancelled : గెలికిన అజిత్.. హర్టైన నయనతార భర్త విఘ్నేశ్ శివన్

AK 62 Project Cancelled కోలీవుడ్‌లో అజిత్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. కోలీవుడ్ టాప్ హీరోల్లో అజిత్ ఒకడు. అజిత్‌తో సినిమా అంటే మామూలు విషయం కాదు. అజిత్‌తో ఒక్కసారి ట్యూన్ అయితే కంటిన్యూగా సినిమాలు ఒకే దర్శకుడితో తీస్తూ ఉంటాడు. అలా శివతో మూడు నాలుగు సినిమాలు చేశాడు. హెచ్ వినోద్‌తోనూ అలానే కంటిన్యూగా సినిమాలు చేశాడు. అయితే ఇప్పుడు అజిత్‌కు విఘ్నేశ్ శివన్‌కు ట్యూనింగ్ సరిగ్గా కుదరనట్టుగా ఉంది.

విఘ్నేశ్ శివన్ కథలో, స్క్రిప్టులో అజిత్ మార్పులు,చేర్పులు సూచించినట్టుగా కనిపిస్తోంది. దీంతో హర్టైన విఘ్నేశ్ శివన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా అయింది. అజిత్ 62వ సినిమా నుంచి విఘ్నేశ్ శివన్ తప్పుకోవడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అజిత్ స్క్రిప్ట్‌ను గెలకడంతోనే విఘ్నేశ్ శివన్ హర్ట్ అయినట్టున్నాడు. అందుకే ఇలా పక్కకి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

 

తాను ఏది రాసినా అందులో ఒరిజినాలిటీ ఉండాలని చూస్తానని, అదే తన కాన్ఫిడెన్స్ అని చెప్పుకొచ్చాడు. దాన్ని తాను ఓన్ చేసుకోవాలని చూస్తానని, ఓ కథ అద్భుతంగా ఉందనే దాని కంటే కూడా అది కంప్లీట్‌గా తనదే అనే ఫీలింగ్  తనకు హై ఇస్తుందంటూ.. తన కథలో మార్పులు చేర్పులు చేయాలని చూసినట్టుగా అందుకే తాను బయటకు వచ్చినట్టుగా విఘ్నేశ్ శివన్ ఇలా పరోక్షంగా కామెంట్లు చేశాడు.

మొత్తానికి విఘ్నేశ్ శివన్‌ మాత్రం తన కోరికను తీర్చుకోలేకపోయాడు. తనకు ఇష్టమైన తలా అజిత్‌తో సినిమా చేస్తున్నానని గాల్లో తేలిపోయాడు. కానీ ఆ ఆనందం ఇట్టే ఆవిరైపోయింది. మరి విఘ్నేశ్ శివన్ తన తదుపరి చిత్రాన్ని ఎవరితో తీస్తాడో చూడాలి.

Also Read:  Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ 'బుట్టబొమ్మ' రివ్యూ... హిట్ కొట్టారా?

Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News