HIT 2 Collections : హిట్ 2 కలెక్షన్లు.. రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన అడివి శేష్

HIT 2 Collections హిట్ రెండో పార్ట్‌కు విమర్శకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆడియెన్స్ సైతం సినిమాను చూసి థ్రిల్ ఫీల్ అవుతున్నారు. విలన్ విషయంలో కాస్త అసంతృప్తి ఉన్నా కూడా అడివి శేష్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 12:05 PM IST
  • హిట్ సెకండ్ కేస్‌ కలెక్షన్స్
  • మొదటి రోజు దుమ్ములేపేసిన అడివి శేష్
  • మేజర్ కలెక్షన్లను దాటలేకపోయిన హిట్ 2
HIT 2 Collections : హిట్ 2 కలెక్షన్లు.. రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన అడివి శేష్

HIT 2 Day 1 Collections : హిట్ సెకండ్ కేస్‌కు సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా కథ, కథనాలు గ్రిప్పింగ్‌గా ఉండటంతో చూసేందుకు జనాలు వస్తున్నారు. విలన్‌ ఎవరా? అని ఎంతో ఆసక్తికిగా వచ్చే ఆడియెన్స్‌కు కొంత షాక్ మాత్రం తగలొచ్చు. ఇతను విలనా? అని అనుకుంటారు. అయితే హిట్ సెకండ్ కేస్ మీదున్న బజ్‌తో ఫస్ట్ డే మాత్రం మంచి కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తున్నాయి.

హిట్ సెకండ్ కేస్ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు 11.75 కోట్ల గ్రాస్, 6,43 కోట్ల షేర్ వచ్చినట్టు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రానికి మొదటి రోజు 6.90 కోట్ల గ్రాస్ .. 4.03 షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఒక్కో ఏరియాలో ఎంత వచ్చిందో ఓ సారి చూద్దాం.

నైజాంలో 1.92 కోట్లు, సీడెడ్‌లో 38లక్షలు, ఉత్తరాంధ్రలో 53 లక్షలు, ఈస్ట్‌లో 29 లక్షలు, వెస్ట్‌లో 19 లక్షలు, గుంటూరులో 33 లక్షలు, కృష్ణాలో 24 లక్షలు, నెల్లూరులో 15 లక్షలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.03కోట్లు వచ్చినట్టు సమాచారం అందుతోంది. అయితే మేజర్ సినిమాకు మొదటి రోజు 4.07కోట్లు వచ్చాయి. అంటే అడివి శేష్ తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేయలేకపోయాడన్న మాట. 

అయితే హిట్ ఫస్ట్ కేస్‌ సినిమా ఫైనల్ రన్ కేవలం పన్నెండు కోట్ల గ్రాస్ మాత్రమే అని తెలుస్తోంది. అంటే ఈ సెకండ్ కేస్ ఆ మొత్తాన్ని ఒకే రోజులో సంపాదించి పెట్టేసింది. హిట్ ఫస్ట్ కేస్ ఫైనల్ రన్.. సెకండ్ కేస్ ఫస్ట్ డేతో సమానమైనట్టు కనిపిస్తోంది.

Also Read :Hari Vairavan Death : నటుడి ఆకస్మిక మరణం.. విష్ణు విశాల్ ఎమోషనల్

Also Read : HIT 2 Main Villain : HIT 2 విలన్.. నెట్టింట్లో దారుణమైన ట్రోల్స్.. పరువుతీస్తోన్న నెటిజన్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News