Adipurush movie: ఆదిపురుష్ చిత్రంలో ఆ ఒక్క భాగానికే 3 వందల కోట్ల బడ్జెట్

Adipurush movie: టాలీవుడ్ టు బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన రెబెల్‌స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ఆదిపురుష్. భారీ అంచనాలున్న ఈ సినిమాలో కేవలం ఆ ఒక్క భాగానికే ఏకంగా 3 వందల కోట్లు ఖర్చు పెడుతున్నారట.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 21, 2021, 05:46 PM IST
  • ఆదిపురుష్ సినిమా మొత్తం బడ్జెట్ 5 వందల కోట్లు
  • సినిమాలో మోషన్ క్యాప్చర్ షూట్ భాగానికే 3 వందల కోట్లు ఖర్చు చేస్తున్న నిర్మాతలు
  • ఇండియన్ సినిమాలో వన్ ఆప్ ది బెస్ట్ విజువల్ ట్రీట్ అంటున్న నిర్మాతలు
Adipurush movie: ఆదిపురుష్ చిత్రంలో ఆ ఒక్క భాగానికే 3 వందల కోట్ల బడ్జెట్

Adipurush movie: టాలీవుడ్ టు బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన రెబెల్‌స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ఆదిపురుష్. భారీ అంచనాలున్న ఈ సినిమాలో కేవలం ఆ ఒక్క భాగానికే ఏకంగా 3 వందల కోట్లు ఖర్చు పెడుతున్నారట.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ( Om Raut) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్(Adipurush movie). రామాయణం ఇతివృత్తంగా రూపుదిద్దుకోబోతున్న చిత్రంలో ప్రభాస్ రాముడిగా..సైఫ్ ఆలీఖాన్ రావణుడిగా..కృతి సనన్ (Kriti sanan) సీతగా నటిస్తున్నారు. 5 వందల కోట్ల భారీ ఖర్చుతో నిర్మితమవుతున్న ఈ సినిమా 2022 ఆగస్టు 11న విడుదల కానుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ షూట్ ప్రారంభమైంది. విజువల్ వండర్‌లో అతికీలకంగా తెరకెక్కిస్తున్నారు. మొత్తం సినిమా బడ్జెట్‌లో ఏకంగా 3 వందల కోట్ల రూపాయల్ని ఈ ఒక్క భాగానికే కేటాయిస్తున్నారట. 

ఇప్పటికే ఈ సినిమా ఇండియాన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతుందని నిర్మాతలు ప్రకటించారు. ఓ వైపు గ్రాఫిక్స్ వర్క్స్ చేస్తూనే మరోవైపు రియల్ క్యారెక్టర్స్‌తో షూటింగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో సలార్ (Salar movie) షెడ్యూల్ పూర్తిచేసిన ప్రభాస్(Prabhas)..ఆదిపురుష్ కోసం ముంబై వెళ్లాడు. ముంబైలో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాముడి పాత్రకోసం ప్రభాస్ భారీగా కసరత్తు చేస్తున్నాడట. పాత్రకు తగ్గట్టుగా స్లిమ్‌లుక్‌లో కన్పించబోతున్నాడు. స్లిమ్ అయ్యేందుకు ముంబైలోని జిమ్‌లో రోజుకు రెండుసార్లు ఉంటున్నాడు టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ , ఓం రౌత్ కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి..అనంతరం తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. 

Also read: Jathiratnalu movie: నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శిలకు రాహుల్ వార్నింగ్ ఇచ్చాడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News