Samantha: కొత్త కమర్షియల్ యాడ్ లో కుమ్మేసిన సమంత.. పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా

దక్షిణ భారత దేశంలోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఫ్యామిలీ మెన్ సీరీస్ తో సత్తా చాటింది సమంత. నాగ చైతన్యతో విడాకులు.. మాయోసైటిస్ అనే వ్యాధికి గురి కావటంతో నిత్యం వార్తల్లో నిలించింది. ఇపుడు కొత్తగా పెప్సికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సమంత.. మొదటి యాడ్ నెట్టింట్లో వైరల్ అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2023, 02:39 PM IST
Samantha: కొత్త కమర్షియల్ యాడ్ లో కుమ్మేసిన సమంత.. పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా

Samantha As a New Brand Ambassador: తెలుగు మరియు తమిళంలో ఇప్పటికే స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతున్న సమంత మరో వైపు బాలీవుడ్‌ లో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హిందీ వెబ్‌ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 లో బోల్డ్‌ యాక్టింగ్‌ తో ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేసిన సమంత ప్రస్తుతం మరో హిందీ సిరీస్‌ లో నటిస్తోంది. సిరీస్ ల్లోనే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తూ హిందీ ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇక తెలుగు మరియు తమిళంలో రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉన్న ముద్దుగుమ్మ సమంత మరో వైపు కమర్షియల్ యాడ్స్ ను కూడా వరుసగా చేస్తూ ఉంది. ఇటీవల సమంత పెప్సీ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్ గా సైన్‌ చేసింది. తాజాగా పెప్సీ కమర్షియల్‌ యాడ్‌ తో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

సమంత షేర్ చేసిన పెప్సీ కంపెనీ కమర్షియల్ యాడ్‌ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 50 సెకన్లు ఉన్న ఈ కమర్షియల్‌ యాడ్‌ లో డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్ లో విభిన్నమైన పాత్రల్లో సమంత కనిపించింది. సమంత యొక్క లుక్ విషయంలో ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ ఫీల్ అయ్యే విధంగా కమర్షియల్ యాడ్‌ ఉంది అనడంలో సందేహం లేదు. సమంత హీరోయిన్ గా విభిన్నమైన పాత్రల్లో ఎలా అయితే కనిపిస్తుందో యాడ్ లో కూడా చాలా ఎనర్జిటిక్ గా విభిన్నమైన గెటప్స్ లో కనిపించింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సమంత చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. అయితే మొదటి సారి బాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ స్టార్స్ బ్రాండ్‌ అంబాసిడర్ లుగా వ్యవహరించిన పెప్సీ కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశం దక్కించుకుంది. ఇందుకు గాను సమంత భారీ మొత్తంలో పారితోషికంను అందుకుంటుంది. రాబోయే సంవత్సర కాలం పాటు సమంత పెప్సీ ప్రచార బాధ్యతను నిర్వహించబోతుంది.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే భారీ అంచనాల నడుమ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా యొక్క గ్రాఫిక్స్ విషయంలో మరియు ఇతర విషయాల పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆ సినిమా ఫలితం గురించి పెద్దగా పట్టించుకోకుండా ప్రస్తుతం సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ యొక్క షూటింగ్‌ లో పాల్గొంటుంది. మరో వైపు విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి చిత్రంలో కూడా సమంత నటిస్తున్న విషయం తెల్సిందే. తమిళం మరియు తెలుగు లో మరి కొన్ని సినిమాలకు గాను సమంత చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. 

Also Read: Ravanasura OTT : ఓటీటీలో రావణాసుర.. ట్విట్టర్‌లో రవితేజ ఫ్యాన్స్ ఎమోషనల్

సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ తర్వాత హిందీలో వరుసగా సినిమాలు మరియు సిరీస్ లు చేసే ఉద్దేశ్యంతో ప్రాజెక్ట్‌ లను సమంత కమిట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌ స్టార్ డమ్ ఉన్న సమంత ముందు ముందు చేయబోతున్న సినిమాలన్నీ కూడా అన్ని భాషల్లో విడుదల అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్‌ గా సమంత ముందు ముందు మరింత బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. నేడు సమంత పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు నెటిజన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హ్యాపీ బర్త్‌ డే సమంత.

Also Read: Janhvi Kapoor Pics : ఉప్పెనలా ఉప్పొంగిన ఎద అందాలు.. కాక రేపుతోన్న జాన్వీ కపూర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News