పాయల్ రాజ్‌పుత్.. RX 100 సినిమాతో టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే హాట్ హాట్‌గా నటించి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది ఈ బ్యూటీ. తన అందంతో పాటు అభినయానికి మంచి మార్కులు కొట్టేసింది. వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). అయితే హీరోయిన్ పాయల్ షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి, లాక్‌డౌన్‌ల కారణంగా కొన్ని నెలలపాటు సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ఇటీవల అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలతో సినిమా, సీరియల్స్ షూటింగ్స్ మొదలయ్యాయి. షూటింగ్‌లో కోవిడ్19 నిబంధనల నేపథ్యంలో కరోనా నిర్ధారణ టెస్టుల కోసం నటి పాయల్ రాజ్‌పుత్ శాంపిల్స్ ఇచ్చారు. అయితే కోవిడ్19 టెస్ట్ (COVID-19 Tests To Payal Rajput)కు శాంపిల్ ఇచ్చే సమయంలో హీరోయిన్ పాయల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చిన్నపిల్లలకు ఇంజెక్షన్ ఇస్తే ఎలా ఏడుస్తారో.. పాయల్ కూడా దాదాపు అలాగే ఏడ్చేసింది.
కాగా, దీనిపై పాయల్ పోస్ట్ చేసింది. ‘కరోనా శాంపిల్స్ తీసుకుంటుంటే నాకు చాలా భయమేసింది. స్వాబ్ కేవలం 5 సెకన్ల వ్యవధిలో ముక్కు నుంచి సేకరించారు. కానీ నాకు అసౌకర్యంగా అనిపించింది, భయం కూడా వేసింది. ఫైనల్‌గా కరోనా టెస్టులో నాకు నెగటివ్ వచ్చిందని’ సంతోషంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. దాదాపు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Payal Rajput: కరోనా టెస్ట్ చేస్తుంటే చిన్నపిల్లలా ఏడ్చేసిన హీరోయిన్