Vijay Deverakonda: మాట నిలబెట్టుకున్న రౌడీ హీరో..షణ్ముఖ ప్రియకి ఛాన్స్

Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ‘ఇండియన్ ఐడల్ సీజన్ 12’లో అద్భుతంగా రాణించిన తెలుగు తేజం షణ్ముఖ ప్రియకు తన ‘లైగర్’ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించాడు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2021, 09:32 PM IST
  • లైగర్‌లో షణ్ముఖ ప్రియకు పాడే అవకాశం
  • ఆమెను కలిసిన ఫొటోలు షేర్ చేసిన హీరో
  • పాట విడుదలకు సన్నాహాలు
Vijay Deverakonda: మాట నిలబెట్టుకున్న రౌడీ హీరో..షణ్ముఖ ప్రియకి ఛాన్స్

Vijay Deverakonda: ప్రముఖ రియాలిటీ షో ‘ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12’లో మెరిసిన తెలుగు తేజం షణ్ముఖ ప్రియకి ఇచ్చిన మాటని రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నిలబెట్టుకున్నారు. తను నటిస్తోన్న ‘లైగర్‌’ చిత్రంలో ఆమెతో ఓ పాట పాడించారు. తాజాగా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల(Social Media) వేదికగా తెలియజేశారు. షణ్ముఖ ప్రియని కలిసి, ఆమెతో ముచ్చటించిన దృశ్యాల్ని అభిమానులతో పంచుకున్నారు.

‘విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)కి నేను అభిమానిని. అలాంటి ఆయన నా గురించి మాట్లాడతారని, నాకు మద్దతిస్తారని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నేను నమ్మలేకపోతున్నా’ అని విజయ్‌ని కలవకముందు షణ్ముఖప్రియ(Shanmukha priya) మనసులోని మాట ఇది. ఈ విషయాన్నే ఇప్పుడు విజయ్‌ షేర్‌ చేసిన వీడియోలో చూపించారు. త్వరలోనే షణ్ముఖ ఆలపించిన గీతాన్ని(Song) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షణ్ముఖ గానం విజయ్‌ని విశేషంగా ఆకట్టుకోవడంతో ‘‘ఇండియన్‌ ఐడల్‌(Indian Idol)’లో నువ్వు ఓడినా, గెలిచినా హైదరాబాద్‌ వచ్చాక మనం కలుస్తాం. నువ్వు నా సినిమాలో పాడతావ్‌. ఇది డీల్‌’ అంటూ గతంలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ వాగ్ధానం నెరవేర్చారు.

Also Read: Pooja Hegde: హాట్ ఫోటో షూట్ లతో అదరగొడుతున్న బుట్ట బొమ్మ..

విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో పూరీ జగన్నాథ్‌(Puri Jagannadh) తెరకెక్కిస్తున్న చిత్రమే ‘లైగర్‌(Liger)’. అనన్య పాండే కథానాయిక. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News