Varun Tej Supports To JanaSena: తన సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా తన సినిమా 'ఆపరేషన్ వాలంటైన్'కు మద్దతు ప్రచారం చేశారు. అనంతర మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సమయంలో ఏపీ రాజకీయాలపై అడిగిన ప్రశ్నలకు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించగా.. 'కుటుంబ పెద్ద ఆదేశిస్తే బాబాయ్ పవన్ కల్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్తా' అని ప్రకటించారు. 'గతంలోనూ మా నాన్న నాగబాబు ప్రచారం చేసిన సమయంలో నేను కూడా వెళ్లాను. బాబాయి పవన్ కల్యాణ్ నమ్మే సిద్ధాంతాలు, నడిచే దారిపై నాకు నమ్మకం ఉంది. ఆ విషయంలో నేను ఎప్పుడూ మద్దతుగా ఉంటా' అని వరుణ్ తేజ్ వెల్లడించారు.
Also Read: Muddapappu, Egg: ఏపీ రాజకీయాల్లో 'ముద్దపప్పు, కోడిగుడ్డు' రచ్చ.. ప్రజలకు మస్త్ వినోదం
సినిమా విషయమై మాట్లాడుతూ.. 'తెలుగులో గగనతలం నేపథ్యంలో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు. ఆపరేషన్ వాలెంటైన్ ఆ లోటును తీరుస్తుంది. దేశభక్తి నేపథ్యంగా సాగే కథ ఇది. మార్చి 1వ తేదీన ప్రేక్షకులు ముందుకు వస్తోంది' అని వరుణ్ తేజ్ తెలిపారు. 'కొన్ని సినిమాలు ప్లాన్ చేసే జరగవు. అలాంటి కోవలోనిదే ఈ సినిమా. కంచె తరువాత ఇలాంటి సినిమా రావడం అదృష్టంగా భావిస్తున్నా. పుల్వామా ఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించాం. ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా బ్లాక్ డే ఘటన జరిగింది. అదేరోజు వాలెంటైన్ డే కావడంతో సినిమాకు ఆపరేషన్ వాలెంటైన్ అనే పేరు పెట్టాం. ఈ సినిమా యూత్‌కు స్ఫూర్తిగా నిలుస్తుంది' అని తెలిపారు.
శక్తిత ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా వస్తున్న 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా మార్చి 1వ తేదీన విడుదల కానుంది. తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. సోనీ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు సంగీతం మిక్కీ జే మెయర్ అందించారు. పుల్వామా ఘటన నేపథ్యంలో ఆకాశంలో జరిగే విమానాల పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు. కొంతకాలంగా సరైన విజయం లేని వరుణ్ తేజ్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో తెలుగు సినిమా తెరపై ఇలాంటి నేపథ్యంలో సినిమా రాలేదు. బాలీవుడ్ రేంజ్‌లో తీసిన సినిమా థియేటర్‌లో నిండుగా కనిపిస్తుందని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే తెలంగాణలో సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి