మరో విషాదం: ప్రముఖ నటుడు రిషి కపూర్ కన్నుమూత

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ను కోల్పోయిన బాధలో ఉన్న హిందీ చిత్రసీమకు మరో షాక్ తగిలింది. సీనియర్‌ నటుడు రిషి కపూర్‌ కన్నుమూశారు.

Last Updated : Apr 30, 2020, 10:38 AM IST
మరో విషాదం: ప్రముఖ నటుడు రిషి కపూర్ కన్నుమూత

ముంబై: బాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ను కోల్పోయిన బాధలో ఉన్న హిందీ చిత్రసీమకు మరో షాక్ తగిలింది. సీనియర్‌ నటుడు రిషి కపూర్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్‌ బుధవారం శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూనే రిషి కపూర్ చనిపోయాడని ఆయన సోదరుడు రణధీర్ కపూర్ వెల్లడించారు. Pics: హాట్ ఫొటోలతో కవ్విస్తోన్న శ్రియ

రిషి కపూర్ సోదరుడు రణధీర్‌ కపూర్‌ పీటీఐతో మాట్లాడారు. ‘రిషికపూర్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఆస్పత్రికి తీసుకొచ్చాం. వైద్యులు చికిత్స అందిస్తున్నారని’ చెప్పారు. అయితే ఆరోగ్యం విషమించడంతో తన సోదరుడు రిషి కపూర్‌ తుదిశ్వాస విడిచారంటూ మరికాసేపటి తర్వాత రణధీర్ కపూర్ శోకసంద్రంలో మునిగిపోయారు.   Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!

2018లో న్యూయార్క్‌కు వెళ్లి అక్కడే క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత 2019 సెప్టెంబర్‌లో భార్య నీతూ కపూర్‌తో కలిసి భారత్‌కు తిరిగొచ్చారు రిషి కపూర్‌. తన మనసులోని మాటల్ని సూటిగా, స్పష్టంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ విమర్శలకు సైతం గురవతుంటారు రిషి. అయితే కొంతకాలం నుంచి సోషల్‌ మీడియాలో ఆయన అంత యాక్టీవ్‌గా లేరు. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు.. ఇండస్ట్రీలో మరో ఆందోళన

బుధవారం బాలీవుడ్‌కు ఇర్ఫాన్ ఖాన్ రూపంలో ఓ షాక్ తగిలింది. దిగ్గజ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ను కోల్పోయిన బాధను జీర్ణించుకునేలోగా మరో ప్రముఖ నటుడు రిషి కపూర్ చనిపోవడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. రిషి కపూర్ మరణంపై సినీ, రాజకీయ, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.    రెండేళ్ల కిందటే తన మరణంపై ఇర్ఫాన్ జోస్యం!  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News