Naresh Clarity on Marriage: పవిత్ర పెళ్లిపై తొలిసారి స్పందించిన నరేష్.. మామూలుగా లేదుగా!

Naresh Clarity on His Marriage: పవిత్ర లోకేష్ తో నరేష్ పెళ్లి అనేది ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా సాగుతున్న  క్రమంలో ఈ విషయం మీద నరేష్ స్పందించారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 10, 2023, 06:25 PM IST
Naresh Clarity on Marriage: పవిత్ర పెళ్లిపై తొలిసారి స్పందించిన నరేష్.. మామూలుగా లేదుగా!

Actor Naresh Clarity on Marriage: పవిత్ర లోకేష్ తో నరేష్ పెళ్లి అనేది ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నరేష్ పవిత్ర నిజంగానే పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకుంటే ఒక వివాహం ఇంకా విడాకులు కాకుండానే మరొక వివాహం చేసుకోవచ్చా అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  మరోపక్క ఈరోజు ఉదయం నరేష్ తన పెళ్లి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం, పవిత్ర బంధం, మూడు ముళ్ళు, ఏడు అడుగులు త్వరలోనే కొత్త జీవితం అంటూ పోస్టు పెట్టడం కూడా వైరల్ అయింది.

ఆ తర్వాత వారిద్దరూ దుబాయ్ లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కూడా వీడియోలు పెద్ద ఎత్తున బయటకు వచ్చాయి. అయితే అనూహ్యంగా నరేష్ ఇంటింటి రామాయణం అనే సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో మెరిశారు. ఆహా ఇంటింటి రామాయణం అనే సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. నిజానికి ఈ వెబ్ మూవీని 2022 డిసెంబర్లోనే ఆహా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంది కానీ వాయిదా వేశారు.

జనవరిలో దియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించారు, రాహుల్ రామకృష్ణ హీరోగా నవ్య స్వామి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాను కొత్త డైరెక్టర్ సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ప్రీమియర్ షోస్ కరీంనగర్, నిజామాబాద్ వంటి సిటీస్లో పడ్డాయి. మార్చి 17వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో నరేష్ కూడా ఒక కీలక పాత్రలో నటించారు.

ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమా ప్రెస్ మీట్ కి హాజరవ్వగా మీడియా ప్రతినిధులు మీ పెళ్లి గురించిన విషయాలు చెప్పమని కోరారు. దానికి ఈ నరేష్ స్పందిస్తూ రియల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు, ఈ ప్రెస్ మీట్ లో నా రియల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాట్లాడాలి అని నేను అనుకోవడం లేదు. త్వరలోనే ఈ విషయం మీద ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందరితో మాట్లాడుతాను అంటూ నరేష్ వెల్లడించారు.
Also Read: Tammareddy Bharadwaja Clarity: ఆర్ఆర్ఆర్ కామెంట్లపై తమ్మారెడ్డి క్లారిటీ.. అసలు విషయం ఇదే అంటూ!

Also Read: Rana Naidu Streaming: ఆలస్యంగా నెట్ ఫ్లిక్స్ లోకి 'రానా నాయుడు'.. వాళ్లతో కలిసి చూడకండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News