Aamir Khan Divorce: విడాకులు తీసుకుంటే సెలబ్రేషనే, ఆమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులపై RGV రియాక్షన్ ఇదే

RGV Responds On Aamir Khan Divorce: ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ విడాకుల నిర్ణయం బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే పెళ్లి, విడాకులు, పుట్టినరోజు లాంటి విషయాలపై భిన్నంగా స్పందించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్రాక్‌లోకి వచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 4, 2021, 03:38 PM IST
Aamir Khan Divorce: విడాకులు తీసుకుంటే సెలబ్రేషనే, ఆమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులపై RGV రియాక్షన్ ఇదే

RGV Responds On Aamir Khan Divorce: బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ విడాకుల నిర్ణయం బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది. నెటిజన్లు సైతం వీరి విడాకుల నిర్ణయంపై తమకు ఇష్టం వచ్చిన తీరుగా స్పందిస్తున్నారు. అయితే పెళ్లి, విడాకులు, పుట్టినరోజు లాంటి విషయాలపై భిన్నంగా స్పందించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్రాక్‌లోకి వచ్చాడు.

ఆమీర్ ఖాన్, కిరణ్ రావు వారికి నచ్చినంత కాలం కలిసి జీవించారని, ఇప్పుడు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో మీకు వచ్చిన నొప్పి ఏంటని ట్రోలర్స్‌ను టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించాడు. విడాకులు తీసుకోవడం వల్ల ఆమీర్ ఖాన్, కిరణ్ రావులకు లేని ఇబ్బంది, మీకెందుకంటూ నెటిజన్లపై మండిపడ్డాడు. ఆ దంపతులు చాలా ప్రొఫెషనల్ విడాకులు (Aamir khan, kiran rao divorce) అనేది వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశమని డైరెక్టర్ వర్మ అభిప్రాయపడ్డాడు.

Also Read: Aamir Khan And Kiran Rao Divorce: ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ నుంచి అర్బాజ్, మలైకా అరోరా వరకు బాలీవుడ్‌లో షాకింగ్‌ విడాకులు ఇవి

విడాకులు తీసుకుంటున్న ఆమీర్ ఖాన్ మరియు కిరణ్ రావులకు డైరెక్టర్ ఆర్జీవీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. విడాకుల అంశాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని విడిపోతున్న బాలీవుడ్ కపుల్స్‌కు సలహా ఇచ్చాడు. గతంలో కంటే వీరిద్దరి జీవితం ఇప్పుడు మరింత రంగులమయం కానుందని ఆకాంక్షించాడు. తెలివితక్కువతనం, విషయాలపై అవగాహన లేకపోవడంతో వివాహాలు చేసుకుంటారని, పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ద్వారా విడాకులు తీసుకుంటారంటూ రామ్ గోపాల్ వర్మ (Tollywood Director Ram Gopal Varma) తనకు తెలిసిన వేదాంతం చెప్పుకొచ్చాడు. ఆమీర్ ఖాన్, కిరణ్ రావు కెరీర్ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు డైరెక్టర్ ఆర్జీవీ వరుస ట్వీట్లు చేయగా అవి ట్రెండింగ్ అవుతున్నాయి.

Also Read: SS Rajamouli: టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి అసహనం, ఏ ఫీలింగ్ కలుగుతుందని ట్వీట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News