Jailer Movie: రజనీ ‘జైలర్‌’ చూడటానికి చెన్నై వచ్చిన జపనీస్‌ దంపతులు, వీడియో వైరల్

Japanese Couple: అభిమానాని భాషా, ప్రాంతంతో సంబంధం ఉండదు. తాజాగా జపాన్ కు చెందిన ఓ జంట తమ ఆరాధ్య నటుడైన రజనీకాంత్ 'జైలర్' సినిమా చూసేందుకు ఒసాకా నుంచి చెన్నైకు వచ్చారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2023, 11:44 AM IST
Jailer Movie: రజనీ ‘జైలర్‌’ చూడటానికి చెన్నై వచ్చిన జపనీస్‌ దంపతులు, వీడియో వైరల్

Jailer Movie Release today: సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయనకు ఇండియాతోపాటు జపాన్ లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. తన స్టైలిష్‌ నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు తలైవా. తాజాగా ఆయన నటించిన ‘జైలర్‌’ (Jailer) మూవీ ఇవాళ రిలీజైంది. తమ అభిమాన నటుడి సినిమాను  స్థానిక థియేటర్లలో తోటి అభిమానులతో కలిసి చూసేందుకు జపాన్‌కు చెందిన ఓ జంట (Japanese couple) ఏకంగా చెన్నై వచ్చింది. జపాన్‌లోని ఒసాకాకు చెందిన యసుదా హిడెతోషి (Yasuda Hidetoshi) తన భార్యతో కలిసి ప్రత్యేకంగా జైలర్‌ సినిమా కోసమే చెన్నపట్టణానికి వచ్చారు. గురువారం ఉదయం చెన్నైలోని ఓ థియేటర్‌లో తమిళ అడియెన్స్ తో కలిసి సినిమా చూశారు. యసుదా.. జపాన్‌లో రజినీ ఫ్యాన్ క్లబ్ లీడర్. 

సూపర్ స్టార్ రజనీకాంత్-నెల్సన్ దిలీప్‌కుమార్‌ కాంబోలో తెరకెక్కిన సినిమా 'జైలర్'. ఈ మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. ఇందులో రమ్యకృష్ణ, తమన్నా, జాకీష్రాఫ్‌, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, సునీల్‌, యోగిబాబు తదితరులు కీ రోల్స్ చేశారు. ఈ మూవీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రెండు రోజుల కిందటే ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 6 లక్షలకుపైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ మూవీ రిలీజ్ కు ముందే రజనీకాంత్ హిమాలయాలకు పయనమయ్యారు. నాలుగేళ్ల తర్వాత ఆయన హిమాలయాలకు వెళ్తున్నారు. 

Also Read: Captain Miller Teaser: బిగ్‌ స్క్రీన్ పై ధనుష్ 'మిల్లర్ టీజర్'.. ఏకంగా 3500 థియేటర్లలో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News