దక్షిణాది సినీ పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుకల్లో బాహుబలి ది కంక్లూజన్‌కి అవార్డుల పంట పండింది. నిన్న శనివారం రాత్రి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా కన్నుల పండుగగా జరిగిన 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు దీంతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఓ తారా తీరాన్ని తలపించింది. దక్షిణాదిన నాలుగు భాషల్లో తెరకెక్కిన చిత్రాల్లో ప్రతిభను కనబర్చిన వారు ఇతర సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారు. తెలుగులో బాహుబలి-2 చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితోపాటు మొత్తం 8 విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకోగా వివిధ కేటగిరీల్లో నాలుగు అవార్డులు కైవసం చేసుకున్న ఫిదా సినిమా ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.
ఇక అర్జున్ రెడ్డి సినిమాకుగాను ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ, క్రిటిక్స్ విభాగంలో గురు సినిమాకు వెంకటేష్ దగ్గుబాటి, ఫిదా సినిమాకుగాను ఉత్తమ నటిగా సాయి పల్లవి, క్రిటిక్స్ విభాగంలో గురు చిత్రానికిగాను ఉత్తమ నటిగా రితికా సింగ్ అవార్డులు అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడైన కైకాల సత్యనారాయణను జీవితకాల సాఫల్య పురస్కారం (లైఫ్ టైమ్ అచీవ్మెంట్) అవార్డుతో సత్కరించారు.
టాలీవుడ్ : తెలుగు సినీ పరిశ్రమలో అవార్డులు అందుకున్న వారి వివరాలు :
ఉత్తమ చిత్రం - బాహుబలి 2
ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2)
ఉత్తమ నటుడు - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి)
ఉత్తమ నటి - సాయి పల్లవి (ఫిదా)
ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - వెంకటేష్ (గురు)
ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రితికా సింగ్ (గురు)
ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (బాహుబలి 2)
ఉత్తమ సహాయ నటి - రమ్యకృష్ణ (బాహుబలి 2)
ఉత్తమ నటి (తొలి పరిచయం) - కల్యాణ్ ప్రియదర్శన్ (హలో)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి 2)
ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా) - అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు, వచ్చిండే
ఉత్తమ గేయ రచయిత - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా సాంగ్)
జీవితకాల సాఫల్య పురస్కారం - కైకాల సత్యనారాయణ
ఉత్తమ నేపథ్య గాయకుడు - హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్)
ఉత్తమ నేపథ్య గాయని - మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్)
ఉత్తమ సంగీత దర్శకుడు - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (బాహుబలి 2)
శాండల్‌వుడ్ : కన్నడ సినీ పరిశ్రమలో అవార్డులు అందుకున్న వారి వివరాలు :
ఉత్తమ చిత్రం - ఒందు మొట్టెయ కథె
ఉత్తమ దర్శకుడు - తరుణ్ సుధీర్ (చౌక)
ఉత్తమ నటుడు - పునీత్ రాజ్ కుమార్ (రాజకుమార సినిమా)
ఉత్తమ నటి - శృతి హరిహరన్ (బ్యూటీఫుల్ మనసుగలు)
ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - ధనంజయ (అల్లమ సినిమా)
ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - శ్రద్ధా శ్రీనాథ్ (ఆపరేషన్ అల్లెమెల్లమ్మ సినిమా)
ఉత్తమ గేయ రచయిత - వి. నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ - చౌక)
ఉత్తమ సహాయ నటుడు - పి రవిశంకర్ (కాలేజ్ కుమార్ )
ఉత్తమ సహాయ నటి - భవానీ ప్రకాశ్ (ఉర్వి సినిమా)
ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్మాన్ మాలిక్ (ఒండు మల్లెబిల్లు - చక్రవర్తి)
ఉత్తమ నేపథ్య గాయని - అనురాధ భట్ (అప్పా ఐ లవ్యూ - చౌక)
ఉత్తమ సంగీత దర్శకుడు - బీజే భరత్ (బ్యూటీఫుల్ మనసుగలు)
కోలీవుడ్ : తమిళ సినీ పరిశ్రమలో అవార్డులు అందుకున్న వారి వివరాలు :
ఉత్తమ చిత్రం - అరమ్
ఉత్తమ దర్శకుడు - పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద)
ఉత్తమ నటుడు - విజయ్ సేతుపతి (విక్రమ్ వేద)
ఉత్తమ నటి - నయనతార (అరమ్)
ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు)
ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - అదితి బాలన్ (ఆరువి)
ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - వైరముత్తు (కాట్రు వెలియిదయ్ - వాన్ మూవీ)
ఉత్తమ సహాయ నటి - నిత్యా మీనన్
ఉత్తమ సహాయ నటుడు - ప్రసన్న
ఉత్తమ నేపథ్య గాయకుడు - అనిరుధ్ రవిచందర్
ఉత్తమ నేపథ్య గాయని - శశా తిరుపతి
ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్)
ఉత్తమ నటుడు (తొలి పరిచయం) - వసంత్ రవి (తారామణి)
మాలీవుడ్ : మళయాళం సినీ పరిశ్రమలో అవార్డులు అందుకున్న వారి వివరాలు :
ఉత్తమ చిత్రం - తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్
ఉత్తమ దర్శకుడు - దిలీష్ పోతెన్ (తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ )
ఉత్తమ నటుడు - ఫహద్ ఫజిల్ (తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ )
ఉత్తమ నటి - పార్వతి (టేక్ ఆఫ్)
ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) - టొవినో థామస్ (మాయనది సినిమా)
ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) - మంజూ వారియర్ (ఉదాహరణం సుజాత సినిమా)
ఉత్తమ సహాయ నటి - శాంతి కృష్ణ
ఉత్తమ సహాయ నటుడు - అలెన్సియెర్ (తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్ )
ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) - అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు)
ఉత్తమ నేపథ్య గాయకుడు - షాబాజ్ అమన్
ఉత్తమ నేపథ్య గాయని - కేఎస్ చిత్ర
ఉత్తమ సంగీత దర్శకుడు - రెక్స్ విజయన్ (మాయనది)
ఉత్తమ నటుడు (తొలి పరిచయం) - ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్)
ఉత్తమ నటి ( తొలిపరిచయం) - ఐశ్వర్య లక్ష్మి
మళయాళంలో తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్, మాయనాది చిత్రాలు అత్యధిక అవార్డులు సొంతం చేసుకున్నాయి.