SI Harassment on Gangrape Victim: గ్యాంగ్ రేప్ విక్టింపై ఎస్సై అరాచకం.. ఉతికి ఆరేసిన గ్రామస్తులు..

Ayodhya Gangrape Case Update: గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలికి న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే మరో ఘాతుకానికి పాల్పడ్డాడు. విచారణ పేరుతో బాధితురాలిపై వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు గట్టిగా అరవడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు అతడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఉతికిపారేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 11:22 AM IST
SI Harassment on Gangrape Victim: గ్యాంగ్ రేప్ విక్టింపై ఎస్సై అరాచకం.. ఉతికి ఆరేసిన గ్రామస్తులు..

Ayodhya Gangrape Case: ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మ భూమిగా పేరొందిన అయోధ్యలో దారుణం చోటుచేసుకుంది. సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాధితురాలి పట్ల జరగకూడని అమానవీయమైన ఘటన ఇది. కొందరు దుర్మార్గుల చేతిలో ఓ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురి కాగా.. ఆ మైనర్ బాలికకు న్యాయం చేయాల్సిన స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్.. ఆమె పట్ల మరో కీచక పర్వానికి తెర తీశాడు. విచారణ పేరుతో ఆ బాధితురాలి వద్దకు వెళ్లిన సబ్ ఇన్‌స్పెక్టర్.. ఆమెకు న్యాయం చేయకపోగా వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం స్వయంగా బాధితురాలే చెప్పుకుని బోరుమంది.

సబ్ ఇన్‌స్పెక్టర్ చేష్టలు చూసి బాధితురాలు గట్టిగా అరవడంతో స్థానికులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో పోగయ్యారు. బాధితురాలు చెప్పిన మాటలు విన్న గ్రామస్తులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓవైపు బాధితురాలికి జరిగిన అన్యాయంపై అప్పటికే రగిలిపోతున్న జనం పోలీసు అధికారి చేష్టలపై మరింత ఆగ్రహం చెందారు. అత్యాచార బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. అతడిని ఏ రేంజులో కొట్టారంటే.. తీవ్ర గాయాలపాలైన సదరు పోలీసు అధికారిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చేంతగా ఉతికి ఆరేశారు. 

ఈ ఘోరానికి పాల్పడిన పోలీసు అధికారి పేరు కేపీ యాదవ్. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా సరే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అయోధ్య రూరల్ ఎస్పీ అతుల్ సోంకర్ తెలిపారు. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం, ఇనాయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కేపీ యాదవ్ సామూహిక అత్యాచార బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయడానికని ఆమె ఇంటికి వెళ్లారు. 

ఇది కూడా చదవండి : Who is Jasneet Kaur: అమ్మాయిల రీల్స్, మెసేజ్ లు టెంప్ట్ అయ్యారా..? ఇక మీ పని అయిపోయినట్టే!

గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసుకోవడానికని బాధితురాలి ఇంటికి మఫ్టీలో వెళ్లిన ఎస్సై.. ఆ సమయంలో తన వెంట మహిళా కానిస్టేబుల్‌ని కూడా వెంట తీసుకెళ్లలేదు. తనని ఏకాంతంగా విచారించే క్రమంలో విచారణ పేరుతో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యత కలిగిన అధికారిగా అత్యాచార బాధితురాలికి న్యాయం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాల్సిన అధికారే తప్పు దోవ పట్టి ప్రస్తుతం ఉన్నతాధికారుల చేతిలో విచారణ ఎదుర్కొంటున్నాడు.

ఇది కూడా చదవండి : Mother Killed Children: అందుకోసం కన్న తల్లే ఇద్దరు పిల్లలను చంపింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News