Triple Talaq Case: పెళ్లి మండపంలోనే త్రిపుల్ తలాక్.. కారణం ఏంటో తెలుసా ?

Triple Talaq Case: అన్ని త్రిపుల్ తలాక్ కేసులు వేరు.. ఈ త్రిపుల్ తలాక్ కేసు వేరు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి భార్యను పెళ్లి మండపం నుంచి ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్లకుండానే పెళ్లయిన రెండు గంటల్లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు.

Written by - Pavan | Last Updated : Jul 17, 2023, 03:56 AM IST
Triple Talaq Case: పెళ్లి మండపంలోనే త్రిపుల్ తలాక్.. కారణం ఏంటో తెలుసా ?

Triple Talaq Case: అన్ని త్రిపుల్ తలాక్ కేసులు వేరు.. ఈ త్రిపుల్ తలాక్ కేసు వేరు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి భార్యను పెళ్లి మండపం నుంచి ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్లకుండానే పెళ్లయిన రెండు గంటల్లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాలోని ప్రియాంషు గార్డెన్‌లో గౌరీ, డాలీ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ల వివాహం ఒకేసారి జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ పెళ్లి వేడుకలో ముందుగా అక్క గౌరి నిఖా వేడుక ఘనంగా పూర్తయింది. ఆ తరువాత చెల్లి డాలీ పెళ్లి జరిగింది. 

డాలిని పెళ్లి చేసుకున్న వరుడు ఆసిఫ్, తనకు కట్నంగా లగ్జరీ కారుతో పాటు మరిన్ని నగలు కావాలి అని డిమాండ్ చేశాడు. తాను అడిగినవి ఇస్తేనే తన భార్య డాలీని ఇంటికి తీసుకెళ్తానని లేదంటే తీసుకెళ్లేది లేదని తెగేసి చెప్పాడు. వరుడి కుటుంబసభ్యులు కూడా అతడికే వత్తసు పలికారు. వరుడు అడిగినవి ఇచ్చేస్తే తాము వధువును తీసుకుని వెళ్తాం అని చెప్పారు. 

వరుడి కుటుంబసభ్యులకు వధువు తల్లిదండ్రులు ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. వరుడి కుటుంబం ససేమిరా చెవికి ఎక్కించుకోలేదు. దీంతో ఈ వివాదం కాస్తా పెరిగి పెద్దదయి పెళ్లి మండపంలోనే ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇప్పుడే ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేశామని.. ఇప్పుడు ఏమీ ఇచ్చుకోలేనని వధువు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వరుడు వినిపించుకోలేదు. అంతటితో ఆగని వరుడు ఆసిఫ్ .. వధువు తల్లిదండ్రులు అతడి కోరికలు తీర్చే పరిస్థితి లేకపోవడంతో తన భార్య డాలీకి అక్కడే త్రిపుల్ తలాక్ చెప్పేశాడు. ఇండియన్ పార్లమెంట్ 2019లో చేసిన చట్టం ప్రకారం, ట్రిపుల్ తలాక్ చెప్పి స్త్రీకి విడాకులు ఇవ్వడం అనేది నేరంగా పరిగణించడం జరుగుతుంది అనే విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆసిఫ్ త్రిపుల్ తలాక్ చెప్పేందుకు వెనుకాడలేదు.

వరుడు ఆసిఫ్ మూడుసార్లు తలాక్ తలాక్ తలాక్ అని చెప్పడంతో వధువు కుటుంబసభ్యులు, బంధువులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇరు కుటుంబాల మధ్య వివాదం ఘర్షణ పడే వరకు వెళ్లింది. వధువు కుటుంబం ఈ ఘటనపై తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వరుడు ఆసిఫ్, అతని తండ్రితో సహా ఏడుగురిపై ఫిర్యాదు చేశారు. వధువు కుటుంబం ఫిర్యాదుతో వరుడు ఆసిఫ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

వధువు డాలి కుటుంబం ఏం చెబుతోందంటే
డాలీ సోదరుడు కమ్రాన్ వార్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటికే వారి కుటుంబం ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం సుమారు 30 లక్షలు రూపాయలు ఖర్చు చేశారు. దానికితోడు వరుడు ఆసిఫ్ పెళ్లి వేడుకకు ఆలస్యంగా వచ్చి పెళ్లి ఆలస్యం అవడానికి కారకుడయ్యాడని, పైగా బోజనాల విషయంలోనూ గొడవ పడ్డాడు అని తెలిపారు. ఇరువైపుల బంధువులు వరుడు ఆసిఫ్ ని, అతడి కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ.. వాళ్లు ఎవ్వరి మాట వినిపించుకోలేదు అని డాలీ సోదరుడు వార్సీ స్పష్టంచేశాడు.

Trending News