Konaseema: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం...

Konaseema: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్ ను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2023, 08:58 AM IST
Konaseema: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం...

Road Accident in Konaseema district: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలమూరు మండలం మడికి నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరికొంత మంది గాయపడ్డారు.

రంపచోడవరానికి చెందిన పది మంది టాటా మ్యాజిక్ వాహనంలో కొత్త పేట మండలం మందసపల్లికి దైవదర్శనం కోసం వెళ్తున్నారు. ఇదే సమయంలో విశాఖపట్నం నుంచి భీమవరం వెళ్తున్న కారు.. వ్యాన్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ఉన్న ముగ్గురు, కారులో ఉన్న మరొక వ్యక్తి మృతి చెందారు. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భాగ్యనగరంలో మరో ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. వనస్థలిపురం జాతీయ రహదారి పక్కన ఉన్న బట్టలు దుకాణం, ఫర్నీచర్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద సమయంలో షాపులో ఎవరూ లేరు. మంటలు అంటుకుని వస్త్రాలన్నీ కాలిపోయాయి. ఫర్నీచర్ అంతా అగ్నికి అహూతైంది. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఆందోళనకు గురయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. 

Also Read: Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News