Telangana: వరంగల్ ​జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..

Road Accident: ఇవాళ తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2022, 08:57 AM IST
Telangana: వరంగల్ ​జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..

Road Accident in warangal: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం వర్ధన్నపేట పట్టణ శివారులోని డీసీ తండా వద్ద జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. 

మృతులు కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకటసాయి రెడ్డిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఏపీలోని ఒంగోలు నుంచి వరంగల్ వస్తుండగా ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాద సమయంలో కారులో 9 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారంతా ఓ శుభకార్యంలో పాల్గొని వరంగల్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు లేక పొగ మంచు ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి గల పూర్తి  కారణాలు తెలియాల్సి ఉంది.

శీతాకాలం వచ్చేసింది. ఉదయం పూట మంచు ఎక్కువగా కురుస్తుంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఉదయం పూట ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

Also Read: Daughter Deadbody Carried on Bike: బైకుపైనే బిడ్డ శవం.. ఏ తండ్రికీ రాకూడని కష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News