Medchal Murder Case: అత్యంత దారుణ ఘటన.. ప్రైవేట్ పార్ట్స్‌పై కారం పెట్టి చిత్రహింసలు.. యువకుడి మృతి

Young Boy Murder in Medchal: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ ‌కారిడార్‌లో ఓ యువకుడు చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోయాడు. తమ కూతురిని ప్రేమించాడని.. బాలిక తల్లిదండ్రులు ప్రైవేట్ పార్ట్స్‌లో కారం పెట్టి చితకబాదారు. వివరాలు ఇలా.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2023, 01:12 PM IST
Medchal Murder Case: అత్యంత దారుణ ఘటన.. ప్రైవేట్ పార్ట్స్‌పై కారం పెట్టి చిత్రహింసలు.. యువకుడి మృతి

Young Boy Murder in Medchal: తెలంగాణలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కూతురిని ప్రేమించిన యువకుడు.. ఎవరూ లేని సమయంలో ఇంటికి రావడంతో పట్టుకుని చిత్రహింసలకు గురిచేశారు. ప్రైవేట్ పార్ట్స్‌లో కారం పెట్టి.. దారుణంగా చితక్కొట్టారు. గంటపాటు ఇష్టానుసారం యువకుడిపై దాడికి పాల్పడడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్ జిల్లాలో పోచారం ఐటీ ‌కారిడార్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

స్థానికంగా ఓ కాలనీకి చెందిన ఓ యువకుడు (18), బాలిక (15) మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసిందే. దీంతో యువకుడిని మందిలించారు. అయినా యువకుడి తీరులో మార్పురాలేదు. బుధవారం బాలిక తల్లిదండ్రులు బయటకువెళ్లారు. బాలిక ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న యువకుడు.. బుధవారం రాత్రి అమ్మాయి ఇంటికి వెళ్లాడు. స్థానికులు గమనించి.. బాలిక తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. 

వెంటనే ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు యువకుడిని పట్టుకుని చితకబాదారు. అంతటితో ఆగకుండా ప్రైవేట్ పార్ట్స్‌పై కారం పెట్టి దాడి చేశారు. దాదాపు గంటపాటు యువకుడిని చిత్రహింసలకు గురి చేసి నరకం చూపించారు. ఆ వేధింపులు తాళలేక యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read: Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

Also Read: 3 Liters Instant Water Geyser Price: క్రోమాలో దీపావళి ఆఫర్స్‌..Usha Instano 3 లీటర్స్‌ వాటర్ గిజర్‌ను రూ.3,550కే పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News