Vespa New Model 2024: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కూటర్స్ బ్రాండ్‌లో వెస్పా ఒకటి.. ఈ కంపెనీకి సంబంధించిన స్కూటర్ ప్రీమియం లుక్ లో అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటాయి. ఇటాలియన్ బ్రాండ్ వెస్పా ఇప్పటికీ భారత మార్కెట్లో అనేక స్కూటీలను విడుదల చేసింది. వీటన్నిటికీ మంచి గుర్తింపు లభించడమే కాకుండా విక్రయాల్లో దూసుకుపోయాయి. ఈ ఇటాలియన్ కంపెనీ 140 సంవత్సరాల క్రితం స్థాపించారు అప్పటినుంచి ఇప్పటివరకు వెస్పా బ్రాండ్ కొత్త కొత్త స్కూటీలతో మార్కెట్లో కస్టమర్లను ఆకర్షిస్తోంది.
ఈ కంపెనీ ప్రారంభమై 140 సంవత్సరాలు కావస్తుండగా ఇటీవలే ఘనంగా వేడుకలు జరిగాయి. అయితే ఈ వేడుకల్లో భాగంగా కంపెనీ కొత్త వెస్పా స్కూటీని ప్రత్యేకమైన ఎడిషన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇది ప్రత్యేకమైన డిజైన్తో పాటు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ బైక్ పై కంపెనీ ఏప్రిల్ 18 నుంచి ప్రీ బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. దీనిని ఏప్రిల్ 21 వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది అయితే ఇప్పటివరకు ఈ బుకింగ్ ప్రక్రియలో భాగంగా 66 దేశాలకు సంబంధించిన కస్టమర్ ఈ స్కూటర్ను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్కూటర్ కు సంబంధించిన విక్రయాలను కంపెనీ భారత్లో ఇంకా అందుబాటులోకి తీసుకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.
కొత్త వెస్పా డిజైన్:
ఇక ఈ స్కూటీ కి సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన గ్రాఫిక్స్‌తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది అంతే కాకుండా దీనిని కంపెనీ వైట్ పెయింట్ తో మార్కెట్లోకి లాంచ్ చేసింది. అలాగే ఇది అద్భుతమైన స్పోర్టి లుక్‌లో కనిపించబోతోంది. దీంతో పాటు యూత్ ఆకర్షించేందుకు అనేక రకాల కొత్త ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది దీని వెనుక భాగంలో 140 అనే బ్రాండింగ్ కూడా కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
అలాగే ఈ స్కూటర్ను ఇప్పటికే కంపెనీ వెస్ప వరల్డ్ టెస్ట్‌లో భాగంగా ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్కు సంబంధించిన ఫీచర్స్ విషయానికి వస్తే ఇది అద్భుతమైన క్లాసిక్ డిజైన్ ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ముందు భాగంలో గుండ్రని హెడ్ లాంప్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ పొజిషన్ ల్యాంప్స్ సింగిల్ సీట్ రేసింగ్ సీట్ వంటి అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది దీంతో పాటు ఇది బ్లూ కలర్ అల్లావీల్స్ తో అందుబాటులోకి వచ్చింది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
278 cc సింగిల్ సిలిండర్ ఇంజన్
23 BSP శక్తిని
26 న్యూటన్ మీటర్ టార్క్
30 కిలోమీటర్ల మైలేజీ
కీలెస్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్
ట్రాక్షన్ కంట్రోల్
బ్లూటూత్ కనెక్టివిటీ
యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి