Vande Bharat Train Timings From Secunderabad to Tirupati: వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ రోజు మరో రెండు వందేభారత్ రైళ్లను కేంద్ర జాతికి అంకితం చేయబోతోంది. మరో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ఈ రోజు ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. మొదటి రైలు సికింద్రాబాద్-తిరుపతి, రెండవ రైలు చెన్నై-కోయంబత్తూరు మార్గాల మధ్య నడవనుంది. అయితే రెండు రైళ్లకు ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్న.
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్:
హైదరాబాద్ నుంచి తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే ప్రయాణికులు ఎక్కువగా ఉండడం వల్ల భక్తులను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లైన్లను అనుసంధానించారు. దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు సులభంగా, వేంగా, త్వరగా ప్రయాణించేందుకు వీలవుతుంది. ఈ రైలు వారానికి 6 రోజులు అంటే మంగళవారం మినహా అన్ని రోజులలో ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ ఎక్స్‌ప్రెస్ గంటకు 77.73 కిలోమీటర్ల వేగంతో నడవనుంది. సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి 14.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇక తిరుపతి నుంచి 15.15 నిమిషాలకు బయలుదేరి 23.45 నిమిషాలకు సికింద్రాబాద్‌కు ప్రయాణికులను చేర్చనుంది. ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది.
Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!
చెన్నై-కోయంబత్తూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్:
ఈ రోజు చెన్నై నగరం నుంచి మరో వందేభారత్ రైలును ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఈ రైలు చెన్నై-కోయంబత్తూరు రైల్వే స్టేషన్లను అనుసంధానం చేస్తూ నడవనుంది. కోయంబత్తూరు, తిరువారూర్, నాగపట్నం ప్రయాణికులకు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మార్గం మధ్య రైలు బుధవారం మినహా ప్రతిరోజు ప్రయాణికులను అందుబాటులో ఉంటుంది. చెన్నై నుంచి కోయంబత్తూరు వరకు 495.28 కిలోమీటర్ల ప్రయాణం చేయనుంది. ఈ ప్రయాణానికి సాధరణంగా 12 నుంచి 15 గంటల టైం పడుతుంది. అయితే మీరు ఈ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తే కేవలం 6 గంటల 10 నిమిషాల్లో చేరుకోవచ్చు.
ఇప్పటి వరకు రైలు నడిచే రూట్ల:
భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 11 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ సంఖ్య 13కి చేరనుంది. ముందుగా ఢిల్లీ నుంచి వారణాసి మధ్య ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత న్యూఢిల్లీ-వైష్ణో దేవి రూట్, గాంధీనగర్-ముంబై రూట్, ఢిల్లీ-అబ్ అందౌరా రూట్, చెన్నై-మైసూర్ రూట్, నాగ్‌పూర్-బిలాస్‌పూర్ రూట్, హౌరా-న్యూ జల్‌పైగురి రూట్, విశాఖపట్నం-సికింద్రాబాద్, ముంబై-సాయినగర్ షిర్డీ, ముంబై షోలాపూర్ మధ్య రూట్లలో నడిచింది. ఈ రైళ్లలో 100 శాతం ఎయిర్ కండిషన్డ్, ఆటోమేటిక్ డోర్లు, GPS సిస్టమ్, WiFi సౌకర్యలు అందుబాటులో ఉన్నాయి.
Also Read: How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook