Highest Sales Car in February 2023: ఫిబ్రవరిలో అత్యధికంగా విక్రయమైన టాప్ 10 కార్ల జాబితా.. మారుతిదే అగ్రస్థానం

Top 10 Cars February 2023: భారతీయ కార్ మార్కెట్‌లో మారుతి సుజుకి వాటా చాలా ఎక్కువ. మారుతి కార్లకు ఇప్పటికీ క్రేజ్, డిమాండ్ కొనసాగుతోంది. అందుకే విక్రయాల్లో ఇంకా అగ్రస్థానంలో కొనసాగుతోంది మారుతి సుజుకి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2023, 08:12 PM IST
Highest Sales Car in February 2023: ఫిబ్రవరిలో అత్యధికంగా విక్రయమైన టాప్ 10 కార్ల జాబితా.. మారుతిదే అగ్రస్థానం

Top 10 Cars: మారుతి సుజుకి కార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫిబ్రవరి 2023 సేల్స్‌లో టాప్ 10 కార్లలో 7 కార్లు మారుతి కంపెనీవే ఉన్నాయంటే ఆ క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడింటిలో ఆరు కార్లు అత్యధికంగా అమ్మకాలు నమోదైన కార్లు కావడం మరో విశేషం. పూర్తి వివరాలు మీ కోసం..

2023 ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్మకాలు జరిపిన టాప్ 10 కార్లలో మారుతి సుజుకి మోడల్స్ 7 ఉన్నాయి. ఇందులో 6 మోడల్స్ టాప్ సెల్లర్ కార్లు కావడం గమనార్హం. టాప్ 10 అత్యధిక విక్రయ కార్లలో 6 కార్లు మారుతి కంపెనీవే. 7వ స్థానంలో మాత్రం టాటా నెక్సాన్ ఉంది. 

ఫిబ్రవరి 2023లో టాప్ 10 సెల్లర్ కార్లు

1. మారుతి సుజుకి బలేనో 18,592 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 12,570 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే 48 శాతం పెరుగుదల నమోదైంది. ఈ కారు ధర 6.5 లక్షల రూపాయల్నించి ప్రారంభమౌతుంది.

2. మారుతి సుజుకి స్విఫ్ట్ 18.412 యూనిట్ల విక్రయాలు జరగగా గత ఏడాది 19,202 యూనిట్లు విక్రయమయ్యాయి. అంటే 4 శాతం విక్రయాలు తగ్గాయి.

3. మారుతి సుజుకి ఆల్టో 18,114 యూనిట్లు విక్రయమయ్యాయి. గత ఏడాది 11, 551 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంటే 57 శాతం పెరుగుదల నమోదైంది. 

4. మారుతి సుజుకి వేగన్ ఆర్ 16,889 యూనిట్ల అమ్మకాలు జరగగా గత ఏడాది 14,669 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంటే 15 శాతం వృద్ధి ఉంది.

5. మారుతి సుజుకి డిజైర్ 16,798 యూనిట్ల విక్రయాలు నమోదు కాగా గత ఏడాది ఫిబ్రవరి నెలలో 17,438 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంటే 4 శాతం అమ్మకాలు తగ్గాయి.

6. మారుతి సుజుకి బ్రెజా 15,787 యూనిట్ల అమ్మకాలు సాధించగా గత ఏడాది ఇదే నెల అంటే ఫిబ్రవరి 2023లో కేవలం 9,256 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంటే 71 శాతం అమ్మకాలు పెరిగాయి.

7. టాటా నెక్సాన్ 13, 914 యూనిట్ల అమ్మకాలు జరపగా, గత ఏడాది ఫిబ్రవరిలో 12, 259 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. 14 శాతం అమ్మకాలు పెరిగాయి.

8. మారుతి సుజుకి ఈకో 11,352 యూనిట్ల అమ్మకాలు జరగగా, గత ఏడాది ఫిబ్రవరిలో 9,190 యూనిట్లు అమ్ముడయ్యాయి. 24 శాతం అమ్మకాలు పెరిగాయి.

9. టాటా పంచ్ 11, 169 యూనిట్ల అమ్మకాలు జరపగా గత ఏడాది ఫిబ్రవరి నెలలో 9,592 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే 16 శాతం పెరుగుదల నమోదైంది.

10. హ్యుండయ్ క్రెటా 10,421 యూనిట్లు విక్రయాలు జరగగా, గత ఏడాది ఫిబ్రవరిలో 9,606 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. అంటే 8 శాతం వృద్ధి సాధించింది.

Also Read: Business Tips 2023: మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే భారీ లాభాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News