Tata Punch Car Insurance: టాటా పంచ్ కారును ఇన్సూరెన్స్ కోసం ఓనర్ ఏం చేస్తున్నాడో చూడండి

Tata Punch Car Insurance: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. టాటా పంచ్ కారును ఓనర్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఒక గోడకు వేసి రాయడం, మరొక చోట మరొక వీడియోలో కారును రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డుకు తగిలేలా తీసుకెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు.

Written by - Pavan | Last Updated : Jan 10, 2023, 10:08 PM IST
Tata Punch Car Insurance: టాటా పంచ్ కారును ఇన్సూరెన్స్ కోసం ఓనర్ ఏం చేస్తున్నాడో చూడండి

Tata Punch Car Insurance: టాటా పంచ్ కారు అంటేనే సేఫ్టీకి పెట్టింది పేరు. అందుకే క్రాష్ టెస్ట్ రేటింగ్‌లో టాటా పంచ్ కారుకు 5 స్టార్ రేటింగ్ లభించింది. భయంకరమైన ప్రమాదాల్లోనూ టాటా పంచ్ కారులో ప్రయాణించిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడిన సందర్భాలు ఉన్నాయి. టాటా పంచ్ కారు సంగతి ఎలా ఉన్నా.. మైనర్ డ్యామేజెస్‌తో ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వెళ్లిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్స్ తిరస్కరిస్తుండటం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అంతేకాదు.. ఈ మైనర్ డామేజెస్ తో ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదనే కారణంతో కారు ఇంకొంత డ్యామేజ్ అయితేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని ఆటోమొబైల్ కంపెనీలు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ చెబుతుంటారనే టాక్ కూడా అప్పుడప్పుుడు వింటుంటాం. 

ఇదిగో ఇక్కడ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. టాటా పంచ్ కారును ఓనర్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఒక గోడకు వేసి రాయడం, మరొక చోట మరొక వీడియోలో కారును రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డుకు తగిలేలా తీసుకెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు. మైనర్ డ్యామేజెస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాకపోగా.. ఇంకొంత డ్యామేజ్ ఉంటేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందని కంపెనీ ప్రతినిధులు చెప్పడం వల్లే కారు యజమాని కావాలనే ఇలా కారును నాశనం చేస్తున్నట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజెన్స్ నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసం ఇలాంటి పద్ధతులు అవలంభించడం సరికాదంటూ టాటా పంచ్ ఓనర్ కి కొంతమంది హితవు పలుకుతున్నారు. 

వాస్తవానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా చేసే యాక్సిడెంట్స్ వల్ల మరేదైనా పెద్ద ప్రమాదం జరిగి ఏదైనా ప్రాణ నష్టం సంభవిస్తే అప్పుడు పరిస్థితి ఏంటనే విషయం మర్చిపోవద్దు.

Trending News