Hyundai Venue Vs Tata Nexon: SUV కార్ మార్కెట్‌లో టాటా నెక్సాన్, హ్యుండయ్ వెన్యూలకు మంచి క్రేజ్ ఉంది. డిమాండ్ ఉంది. రెండింటి ధర కూడా దాదాపుగా ఒకటే. కానీ డిజైన్, ఫీచర్లు మాత్రం వేరుగా ఉంటాయి. ఈ ఫీచర్ల ఆధారంగానే చాలామంది టాటా నెక్సాన్ అంటే ఇష్టపడుతుంటారు. హ్యుండయ్ వెన్యూలో లేని టాటా నెక్సాన్‌లో ఉన్న 5 ప్రధాన ఫీచర్ల గురించి పరిశీలిద్దాం. బహుశా అందుకే టాటా నెక్సాన్ ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా విక్రయమౌతోంది.
1. హైట్ ఎడ్జస్టబుల్ సీట్ బెల్ట్
టాటా నెక్సాన్‌లో డ్రైవర్, కో పాసెంజర్ కోసం హైట్ ఎడ్జస్టబుల్ సీట్ బెల్ట్ సౌకర్యం అందుబాటులో ఉంది. కానీ హ్యుండయ్‌లో ఫిక్స్డ్ సీట్ బెల్ట్ ఉంటుంది. అయితే నెక్సాన్, వెన్యూ రెండింటిలోనూ ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్‌గా ఉంటుంది.
2. ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడ్ రేర్ వ్యూ మిర్రర్
టాటా నెక్సాన్ కాజీరంగా ఎడిషన్‌లో ఆటో డిమ్మింగ్ ఇన్‌సైడర్ రేర్ వ్యూ మిర్రర్ అందుబాటులో ఉంది. కాని హ్యుండయ్ వెన్యూ ఫేస్ లిఫ్ట్ వెర్షన్‌లో ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం తొలగించింది కంపెనీ. వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌లో మేన్యువల్ ఎడ్జస్టబుల్ డే అండ్ నైట్ ఐఆర్వీఎం ఉంది.
3. రేర్ ట్వీటర్‌తో ప్రీమియం సౌండ్ సిస్టమ్
టాటా నెక్సాన్‌లో హర్మన్ కంపెనీకు చెందిన 8 స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఉంది. గానీ హ్యుండయ్ వెన్యూలో అన్‌బ్రాండెడ్ ఆడియో సిస్టమ్ 6 స్పీకర్ ఉంది.నెక్సాన్‌లో 4 స్పీకర్, 4 ట్వీటర్ ఉంటాయి. వెన్యూలో 4 స్పీకర్, 2 ట్వీటర్ వస్తాయి.
4. ఆటోమేటిక్ వైపర్స్
టాటా నెక్సాన్, హ్యుండయ్ వెన్యూలో ఆటోమేటిక్ హెడ్ లైట్స్ ఆఫర్ ఉంది. కానీ ఆటోమేటిక్ వైపర్ కేవలం నెక్సాన్‌లోనే లభ్యమౌతుంది. వెన్యూలో ఆటోమేటిక్ వైపర్స్ లేవు.
5. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్
హ్యుండయ్ వెన్యూలో వెంటిలేటెడ్ సీట్స్ లేవు. టాటా నెక్సాన్ టాప్ స్పెక్ వేరియంట్‌లో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి. వెంటిలేటెడ్ సీట్స్ వేసవిలో పనిచేస్తాయి. ప్యాసెంజర్‌కు త్వరగా కూలింగ్ అందించేందుకు దోహదపడతాయి.
Also Read: Honda Amaze: హోండా సిటీ లాంటి రిచ్ లుక్ కలిగిన సెడాన్ ఇదే, ధర కూడా 4.5 లక్షలు తక్కువ
Also Read: SSC Student Complaint on Bandi Sanjay: బండి సంజయ్‌పై పదో తరగతి విద్యార్థుల ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook