Nexon EV price hike: టాటా మోటార్స్‌కు చెందిన బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్ నెక్సాన్ ఈవీ మరింత ప్రియవనుంది. ఈ మోడల్ ధరను రూ.25,000 వేల వరకు పెంచుతూ టాటా మోటార్స్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనితో వేరియంట్ల వారీగా ఈ మోడల్ ధరలు రూ.14.54 లక్షల నుంచి రూ.17.15 లక్షల వరకు (ఎక్స్ షోరూం) పెరగనున్నట్లు సమాచారం.
దేశీయంగా అందుబాటులో ఉన్న ఈవీల్లో.. నెక్సాన్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచేందుకు దీని ధర కూడా ఒక కారణమని చెబుతుంటారు విశ్లేషకులు. ఇతర కంపెనీలైన ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యూందాయ్ కోనా ఎలక్ట్రిక్ వంటి వాటితో దీని ధర తక్కువగా ఉండటం.. ఫీచర్లు అధికంగా ఉండటం వంటివి నెక్సాన్ ప్రత్యేకతలు. మరి ధరల పెంపు ప్రభావం దీనిపై ఎలా ఉంటుందో వేచి చూడాలని చెబుతున్నారు విశ్లేషకులు.
నెక్సాన్‌లో కొన్ని ప్రత్యేకతలు..
ఇందులో 127 హార్స్పవర్, 245 ఎన్ఎం ఇంజిన్ ఉంటుంది. 30.2కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు 312 కిలోమీటర్ల వెళ్లగలదని కంపెనీ వర్గాల ద్వారా తెలిసింది.
ప్రస్తుతం నెక్సాన్ ఈవీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్ఎం, ఎక్స్జెడ్ ప్లస్, ఎక్స్జెడ్ ప్లస్ ఎల్యూఎక్స్ వంటి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. డార్క్ ఎడిషన్‌లో కూడా రెండు వేరియంట్లలో ఈ మోడల్ అందుబాటులో ఉంది. ఈ కార్లో టైయర్ ప్రెషర్ మానిటర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
కొత్త వేరియంట్‌పై టాటా కసరత్తు..
టాటా మోటార్స్ ప్రస్తుతం నెక్సాన్ ఈవీ మోడల్లో కొత్త వేరియంట్‌పై కసరత్తు చేస్తోందని సమాచారం. 40 కిలో వాట్స్ బ్యాటరీతో ఈ వేరియంట్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వేరియంట్లతో పోలిస్తే దీని ధర రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు అధికంగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం వేరియంట్లతో పోలిస్తే.. కొత్త వేరియంట్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 400కిలో మీటర్ల వరకు ప్రయాణించే వీలుందని టెస్టింగ్ దశలో తేలింది. వినియోగంలోకి వస్తే కనీసం 300-320 కిలో మీటర్లు ప్రయాణించే వీలుందని అంచనాలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook