State Bank of India Hikes MCLR: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్. రుణ రేటు మార్జినల్ కాస్ట్ (MCLR)ను పెంచుతున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. 5 నుంచి 10 బేసిస్ పాయింట్లతో ఎంపిక చేసిన పదవీకాలాలపై పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. అంటే వెహికల్, హోమ్ లోన్‌ల ఈఎంఐలు మరింత ఖరీదు కానున్నాయి. త్వరలో లోన్లు తీసుకోవాలని అనుకుంటున్న వారు కూడా ఎక్కువ వడ్డీకి లోన్లు తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా పెంచిన రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో కూడా అప్‌డేట్ చేసింది. ఈ సవరించిన రేట్లు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మార్పు ఓవర్‌నైట్ పదవీకాలం మినహా ఇతర పదవీకాలాన్ని కూడా ప్రభావితం చూపనుంది.
కొత్త రేట్లు ఒక నెల కాలవ్యవధికి 8.20 శాతం, 3 నెలల కాలవ్యవధికి 8.20 శాతం, 6 నెలల కాలవ్యవధికి 8.55 శాతం, ఒక సంవత్సర కాలవ్యవధికి 8.65 శాతం, రెండేళ్ల కాలవ్యవధికి 8.75 శాతం, మూడేళ్ల కాలవ్యవధికి 8.85 శాతం వడ్డీ రేట్లు అమలుకానున్నాయి. అంతేకాకుండా బీపీఎల్ఆర్ కూడా 15 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు కూడా నేటి నుంచే అమలులోకి వచ్చింది.
కాగా.. ఎస్‌బీఐ ఇటీవల గృహ రుణ వడ్డీ రేట్లలో 65 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపుతో ప్రత్యేక పండుగ సీజన్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. బ్యాంకు 8.4 శాతం చొప్పున హోమ్ లోన్ ఇస్తోంది. అంతేకాకుండా ఎస్‌బీఐ టాప్ అప్ హౌస్ లోన్‌పై 8.9 శాతం రాయితీ రేటును కూడా పొందవచ్చు. అంటే జనవరి 1 నుంచి గృహ రుణానికి ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఎంసీఎల్ఆర్ అంటే బ్యాంకులు తమ వినియోగదారులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేటు. MCLR ఏప్రిల్ 2016లో ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది. బ్యాంకులు నిర్ణయింంచిన ఎంసీఎల్ఆర్ రేటు కంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్లు ఇచ్చేందుకు వీల్లేదు. అన్ని బ్యాంకులు తప్పకుండా ఎంసీఎల్ఆర్ రేట్లను అమలు చేయాలని.. ఒకే నిబంధనలు పాటించాలని ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటి నుంచి అన్ని బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ రేట్లను వెల్లడిస్తున్నాయి. ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. లోన్ల ఈఎంఐ కూడా పెరుగుతుంది. ఎంసీఎల్ఆర్ రేటు తగ్గితే.. ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. ఇది ఎక్కువగా హోమ్ లోన్లు, వెహికల్ లోన్లు, పర్సనల్ లోన్లకు వర్తిస్తుంది.
Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు
Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి