Share Market: ఈ వారం ఐపీవోలు, ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి

Share Market: షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే ఔత్సాహికులకు పరిశీలన చాలా అవసరం. ప్రతి వారం కొత్త కొత్త స్టాక్స్ వస్తుంటాయి. ఇందులో ఏవి బెటర్ ఏవి కావనేది తెలుసుకుని ఇన్వెస్ట్ చేయగలిగితే ఇక తిరుగుండదంటారు మార్కెట్ విశ్లేషకులు. ఆ వివరాలు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 9, 2023, 01:44 PM IST
Share Market: ఈ వారం ఐపీవోలు, ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి

Share Market: నిశిత పరిశీలన, అవగాహన ఉంటే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా అత్యుత్తమమైంది. ఎప్పుడు ఏ స్టాక్ పనితీరు ఎలా ఉంది, ఏయే కంపెనీలు కొత్తగా ఐపీవోలు ప్రవేశపెడుతున్నాయనేది తెలుసుకోవాలి. రిస్క్ తగ్గించుకుంటూ లాభాలు ఆర్జించాలంటే ఐపీవోలను పరిశీలిస్తుండాలి. ఈ వారంలో ఇన్వెస్ట్ చేయదగిన 5 బెస్ట్ ఐపీవోల గురించి పరిశీలిద్దాం.

షేర్ మార్కెట్ ప్రతి వారం కొత్త ఐపీవోలు లిస్ట్ అవుతుంటాయి. డిసెంబర్ 4 అంటే గత వారం ముగిసిన తరువాత ఈ వారంలో కొన్ని ఐపీవోలు లిస్ట్ అయ్యాయి. ఈ ఐపీవోల్లో కొన్ని క్లోజ్ అయితే కొన్ని ఇంకా ఉన్నాయి. ఒకవేళ క్లోజ్ అయినా వీటిపై కాస్త సునిశితంగా అధ్యయనం చేయగలిగితే రానున్న వారంలో పెట్టుబడికి పనిచేయవచ్చు. మరి కొన్ని ఐపీవోలు ఇంకా ఓపెన్ అయున్నాయి. మీ అదృష్టం పరీక్షించుకోవచ్చు. ఆ ఐపీవోల వివరాలు ఇలా ఉన్నాయి. నెట్ ఎవెన్యూ టెక్నాలజీస్ కొత్తగా ఐపీవో లిస్ట్ అయింది. డిసెంబర్ 4తో క్లోజ్ అయిన ఈ ఐపీవో పరిమాణం 10.25 కోట్లుగా ఉంది. షేర్ లాట్ సైజ్ 8000 షేర్లు. ఒక్కొక్క షేర్ విలువ 16-18 రూపాయలు మధ్యలో ఉంది. మొత్తం 56.96 లక్షల కొత్త షేర్లు ఆఫర్ చేసింది. 

ఇక గ్రాఫిస్ యాడ్స్ మరో ఐపీవో. డిసెంబర్ 5తో క్లోజ్ అయిన ఈ ఐపీవో పరిమాణం 53.41 కోట్లుగా ఉంది. లాట్ సైజ్ 1200 షేర్లు. ప్రైస్ బ్యాండ్ ఒక్కొక్క షేర్ 111 రూపాయలుగా ఉంది. మొత్తం 48.12 లక్షల కొత్త షేర్లు ఆఫర్ చేసింది. 

మెరైన్ ట్రాన్స్ ఇండియా ఐపీవో కూడా డిసెంబర్ 5తో ముగిసింది. ఈ ఐపీవో పరిమాణం 10.92 కోట్లు. లాట్ సైజ్ 4 వేల షేర్లు కాగా ప్రైస్ బ్యాండ్ ఒక్కొక్క షేర్ విలువ 26 రూపాయలుగా ఉంది. మొత్తం 42 కొత్త షేర్లు ఆఫర్ చేసింది. 

ఇక స్వస్తిక్ ప్లాస్కాన్ డిసెంబర్ 7న లిస్ట్ అయింది. ఐపీవో పరిమాణం 40.76 కోట్లు కాగా ఇన్వెస్టర్ల నుంచి అద్భుతమైన స్పందన వ్యక్తమౌతోంది. 15.43 రెట్లు సబ్‌స్క్రైబ్ అయినట్టు తెలుస్తోంది. 

ఇక షీతల్ యూనివర్శల్ ఐపీవో డిసెంబర్ 4న ప్రారంభమై డిసెంబర్ 6న క్లోజ్ అయింది. ఈ ఐపీవో పరిమాణం 23.8 కోట్లు. ఒక్కొక్క షేర్ విలువ 70 రూపాయలు కాగా లాట్ సైజ్ 2000 షేర్లుగా ఉంది. 34 లక్షల కొత్త షేర్లు ఆఫర్ చేసింది. 

ఇక ప్రస్తుతం నిన్ననే ఓపెన్ అయిన ఐపీవో యాక్సెంట్ మైక్రోసెల్ ఐపీవో. డిసెంబర్ 8న ప్రారంభమైంది. డిసెంబర్ 12 వరకూ గడువుంది. ఇష్యూ పరిమాణం 78.4 కోట్లు కాగా ప్రైస్ బ్యాండ్ ఒక్కొక్క షేర్ విలువ 133-140 రూపాయలుగా ఉంది. లాట్ సైజ్ 100 షెర్లు కావడంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రతి ఇన్వెస్టర్ షేర్ మార్కెట్ ఐపీవోలపై సునిశితంగా పరిశీలన తరువాతే రిస్క్‌ను అంచనా వేసుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 

Also read: SBI FD Interest Rate: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త..! ఈ స్పెషల్ ఎఫ్‌డీపై అదిరిపోయే వడ్డీ రేట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News