Share Market IPO: షేర్ మార్కెట్‌లో మరో ఐపీవో, 14 వేల పెట్టుబడితో రెట్టింపు లాభాలు

Share Market IPO: షేర్ మార్కెట్ అంటేనే ఓ వింత ప్రపంచం. ఎప్పుడు ఏ కంపెనీ షేర్ పైకి లేస్తుందో ఏది పడిపోతుందో అంచనా వేయలేని పరిస్థితి. సరైన అవగాహన ఉంటే కచ్చితంగా షేర్ మార్కెట్ ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 3, 2023, 08:02 PM IST
Share Market IPO: షేర్ మార్కెట్‌లో మరో ఐపీవో, 14 వేల పెట్టుబడితో రెట్టింపు లాభాలు

Share Market IPO: ఐపీవోలో పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తుంటే ఇదే మంచి సమయం. షేర్ మార్కెట్‌లో మరో కొత్త కంపెనీ ఐపీవో ప్రారంభమౌతుంది. పెట్టుబడి పెడితే త్వరలో లాభాలు ఆర్జించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడితే రిటర్న్స్ బాగుంటాయనే అంచనా ఉంది.

షేర్ మార్కెట్‌లో మరో ఐపీవో వస్తోంది. కోల్‌కతాకు చెందిన సెన్కో గోల్డ్ డైమండ్ కంపెనీ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ జూలై 4వ తేదీన ఓపెన్ కానుంది. జూలై 4 న ఓపెన్ అయి..జూలై 6వ తేదీన క్లోజ్ కానుంది. ఈ కంపెనీ ఐపీవోలో పెట్టుబడులు పెట్టాలంటే మూడ్రోజులే సమయముంది. సెన్కో గోల్డ్ డైమండ్ కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ కూడా నిర్ధారణైపోయింది. ఐపీవో ధర ఒక్కొక్క షేర్ కు 301 నుంచి 307 రూపాయలుంటుంది. సెన్కో ఐపీవోతో 270 కోట్ల రూపాయల మేర కొత్త షేర్లు జారీ చేస్తోంది. అంతేకాకుండా కంపెనీ షేర్ హోల్డర్ సైఫ్ పార్టనర్స్ ఇండియా-4 లిమిటెడ్ 135 కోట్ల రూపాయలు ఓఎఫ్ఎస్ కూడా ప్రవేశపెడుతోంది. 

ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేయాలంటే 14,147 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లాట్ సైజ్ లో 47 షేర్లు లభిస్తాయి. అంటే ఒక లాట్‌లో 47 షేర్లు ఉంటాయి. కనీసం ఒక లాట్ కొనాల్సి వస్తుంది. ప్రస్తుతం సైఫ్ పార్టనర్స్ వాటా 19.23 శాతంగా ఉంది. కంపెనీ ఐపీవో ద్వారా 8-9 శాతం వాటా విక్రయించనుంది. ఐపీవో బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, ఏంబిట్, ఎస్బీఐ కేపిటల్ మార్కెటర్స్ ఉన్నాయి.

ఈ కంపెనీ షేర్ల కేటాయింపు ప్రక్రియ జూలై 11న పూర్తి కానుంది. జూలై 14న కంపెనీ షేర్ల లిస్టింగ్ అవుతుంది. కంపెనీ ఐపీవో ద్వారా సమీకరించే 270 కోట్ల రూపాయల్నించి 190 కోట్ల రూపాయల్ని రన్నింగ్ కేపిటల్ నిమిత్తం కేటాయిస్తుంది. షేర్ ద్వారా వసూలయ్యే డబ్బుల్ని ఇతర పనుల కోసం ఖర్చు చేయనుంది. సెన్కో గోల్డ్ డైమండ్ కంపెనీకు 13 రాష్ట్రాల్లో 140 షోరూంలు ఉన్నాయి. ఇందులో 63 శాతం షోరూంలు ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే ఉన్నాయి.

Also read: Tata New Electric Car: టాటా నుంచి మరో కొత్త ఈవీ, ఫుల్‌ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News