Share Market: షేర్ మార్కెట్‌లో సంపాదనకు అద్బుత అవకాశం, త్వరలో మద్యం తయారీ కంపెనీ ఐపీవో

Share Market: షేర్ మార్కెట్‌లో ఇటీవల చాలా కంపెనీలు ఎంట్రీ ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు లాభాలు అందిస్తుంటే..మరికొన్ని నష్టాల్లో ఉంటున్నాయి. త్వరలో మరో కంపెనీ ఐపీవో వెలువడనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 9, 2022, 03:55 PM IST
  • షేర్ మార్కెట్‌లో త్వరలో మరో కంపెనీ ఐపీవో, ఇప్పటికే అనుమతి ఇచ్చిన సెబి
  • మద్యం తయారీ కంపెనీ సులా వైన్‌యార్డ్స్ నుంచి ఐపీవో విడుదల త్వరలో
  • 25 లక్షల షేర్లు కేటాయిస్తున్న సులా వైన్‌యార్డ్స్ కంపెనీ, గత యేడాది విశేషంగా లాభాలు ఆర్జించిన సులా వైన్‌యార్డ్స్
Share Market: షేర్ మార్కెట్‌లో సంపాదనకు అద్బుత అవకాశం, త్వరలో మద్యం తయారీ కంపెనీ ఐపీవో

అద్భుత లాభాలు ఆర్జించాలంటే షేర్ మార్కెట్ మంచి ప్రత్యామ్నాయం. జాగ్రత్తగా పెట్టుబడి పెడితే ఆశించిన ప్రయోజనాలుంటాయి. త్వరలో ఓ మద్యం కంపెనీ ఐపీవో మార్కెట్‌లో రానుంది. ఆ కంపెనీ షేర్ వివరాలు ఇలా ఉన్నాయి..

షేర్ మార్కెట్‌లో ఇటీవలి కాలంలో నిధుల సమీకరణకే పలు కంపెనీలు ఐపీవో ఇష్యూ చేస్తున్నాయి. ఏ కంపెనీ ఐపీవో ఎలా ఉందనేది జాగ్రత్తగా పరిశీలించాలి. ఐపీవోలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీకొక అవకాశం. ఇప్పుడు త్వరలో మద్యం తయారీ కంపెనీ సులా వైన్‌యార్డ్స్ ఐపీవో మార్కెట్‌లో రానుంది. 

జూలైలో సిద్ధమైన ఐపీవో డ్రాఫ్ట్

సులా వైన్‌యార్డ్స్ ఐపీవోకు ఇప్పటికే సెబి అనుమతి లభించింది. సులా వైన్‌యార్డ్స్ దేశంలోని ప్రముఖ మద్యం తయారీ కంపెనీ. ఈ కంపెనీ మద్యం తయారు చేసి విక్రయిస్తుంటుంది. ఈ ఏడాది జూలైలో పబ్లిక్ ఇష్యూ ఐపీవో కోసం డ్రాఫ్ట్ సమర్పించింది. ఓఎఫ్ఎస్ ఆధారంలో ఈ ఐపీవో ఉంటుంది.

56 రకాల మద్యం ఉత్పత్తి

సులా వైన్‌యార్డ్స్ ఐపీవోలో ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు, ఇతర షేర్ హోల్డర్లకు 25,546,186 ఈక్విటీ షేర్లు ఉంటాయి. సులా వైన్‌యార్డ్స్ కంపెనీ రెడ్, వైట్ , స్పార్క్లింగ్ మద్యంను విక్రయిస్తుంటుంది. ఈ కంపెనీ 13 బ్రాండ్లలో 56 రకాల మద్యం తయారు చేస్తుంది.

సులా వైన్‌యార్డ్స్ గత ఏడాది కంపెనీ ఉత్పాదన సామర్ధ్యం 14.5 మిలియన్ లీటర్ల మద్యంగా ఉంది. గత ఆర్ధిక సంవత్సరం 2022లో కంపెనీ లాభం పలు రెట్లు పెరిగి 52.14 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2021లో ఇది కేవలం 3.01 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ కంపెనీకు స్వయంగా 4 ఫ్యాక్టరీలున్నాయి. మరో రెండు కర్ణాటక, మహారాష్ట్రలో లీజుపై ఉన్నాయి. 

Also read: Shorts On Smart TVs: ఇక స్మార్ట్ టీవీల్లోనూ యూట్యూబ్ షార్ట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News