IPO Updates: వచ్చే వారం నాలుగు ఐపీవోలు, 14వేల పెట్టుబడితో లాభాలు ఆర్జించే అవకాశం

IPO Updates: షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే ఈ గుడ్‌న్యూస్ మీకే. ఇప్పుడు మంచి అవకాశం లభించనుంది. ఏకంగా 4 కంపెనీల ఐపీవో వారం రోజుల్లో వెలువడనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 6, 2022, 05:58 PM IST
IPO Updates: వచ్చే వారం నాలుగు ఐపీవోలు, 14వేల పెట్టుబడితో లాభాలు ఆర్జించే అవకాశం

షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టేందుకు మంచి అవకాశమిది. మరో వారం రోజుల్లో మార్కెట్‌లో వస్తున్న నాలుగు కంపెనీల్లో కేవలం 14 వేలు పెట్టుబడి ద్వారా లాభాలు సాధించవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

షేర్ మార్కెట్ పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే..అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఇప్పుడు వచ్చేవారం నాలుగు కంపెనీల ఐపీవోలు వెలువడనున్నాయి. ఈ ఐపీవోల్లో కేవలం 14 వేల పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. ఐపీవోల ద్వారా చాలామంది ఇన్వెస్టర్లు స్వల్ప వ్యవధిలో రెట్టింపు లాభాలు ఆర్జించి ఉన్నారు. మరోసారి అలాంటి అవకాశం ఈ నాలుగు కంపెనీల ఐపీవోల ద్వారా లభిస్తోంది. 

1. archean Chemical Industries IPO

ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్ ఐపీవో త్వరలోనే వెలువడనుంది. కంపెనీ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 9వ తేదీన ఓపెన్ కానుంది. 11వ తేదీన క్లోజ్ అవుతుంది. కంపెనీ ఈ ఐపీవోలో 805 కోట్లు షేర్లను తొలిసారి 1.61 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తోంది. ఐపీవో ప్రైస్ 386-407 మధ్య ఉండవచ్చు. 1462 కోట్ల రూపాయలు కంపెనీ సమీకరించనుంది.

2. Five star Business Finance IPO

ఫైవ్‌స్టార్ బిజినెస్ ఫైనాన్స్ కంపెనీ కూడా ఇన్వెస్టర్లకై ఐపీవో వెలువరిస్తోంది. కంపెనీ ఈ ఐపీవో ద్వారా 1960కోట్లు సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. ఐపీవో ప్రైస్ 450-474 రూపాయల మధ్య ఉండవచ్చు. ఇన్వెస్టర్లు నవంబర్ 8 నుంచి నవంబర్ 11 వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు.

3. Kaynes Technology India IPO

కేన్స్ ఎలక్ట్రిక్ ఇండియా లిమిటెడ్ ఐపీవో నవంబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 14 వరకూ ఓపెన్‌లో ఉంటుంది. ఈ ఐపీవో ప్రైస్ 559-587 రూపాయల మధ్య ఉండవచ్చు. ఈ ఐపీవో ద్వారా కంపెనీ 857.8 కోట్ల రూపాయలు సమీకరించనుంది.

4. Inox Green Energy IPO

ఇక ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ కూడా ఐపీవో తీసుకొస్తోంది. కంపెనీ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ నవంబర్ 11న ప్రారంభమై..15వ తేదీన క్లోజ్ కానుంది. కంపెనీ ఈ ఐపీవో ద్వారా 740 కోట్ల రూపాయలు సమీకరించనుంది. 

Also read: Digital Rupee: డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి, క్రిప్టోకరెన్సీకు, డిజిటల్ రూపీకు తేడా ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News