Senior Citizen Schemes: ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎక్కడైనా చేయవచ్చు గానీ రిస్క్ లేకుండా అదిక రిటర్న్స్ ఇచ్చే పథకాలైతే సీనియర్ సిటిజన్లకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అధిక ప్రయోజనాలు కల్గించే పథకాలైన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్‌లలో ఏది బెస్ట్ అనేది పరిశీలిద్దాం.
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్
ఇది పూర్తిగా రిటైర్ అయిన వ్యక్తులకు ఉద్దేశించింది. 60 ఏళ్లు దాటిన వ్యక్తులకు ఇది మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కాగలదు. ఇదులో రిటర్న్స్ బాగుంటాయి. ఈ పథకంలో ఒకేసారి పెద్దమొత్తం డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌డి, సేవింగ్ స్కీమ్ రెండింట్లోనూ లాకింగ్ పీరియడ్ ఒకటే. కానీ రెండింటికీ తేడా ఉంది. ప్రయోజనాల పరంగా రెండింట్లో వ్యత్యాసం ఉంటుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ప్రభుత్వ గ్యారంటీ కలిగిన పథకం కావడంతో రిటర్న్స్‌తో పాటు సెక్యూరిటీ ఉటుంది. ఈ పధకంలో ఇన్‌కంటాక్స్ చట్టం 1961 సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఈ పధకం మెచ్యూరిటీ 5 ఏళ్లు ఉంటుంది. ఆ తరువాత మరో మూడేళ్లు పొడిగించవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఎక్కౌంట్ తెరవడం కూడా చాలా సులభం. ఏదైనా పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకులో ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. దేశంలో ఏ బ్రాంచ్‌కైనా ఎక్కౌంట్ బదిలీ చేసుకోవచ్చు. ఈ పధకంలో కనీస పెట్టుబడి 1000 రూపాయలు. గరిష్టంగా 30 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.
సీనియర్ సిటిజన్ ఎఫ్‌డి
సాధారణ ఎఫ్‌డితో పోలిస్తే బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ లభిస్తుంది. సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే 0.5 శాతం వడ్డీ అదనంగా ఉంటుంది. వడ్డీ పొందేందుకు ఇన్వెస్టర్లకు ఆప్షన్లు ఉంటాయి. నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి వడ్డీ అందుకునే అవకాశముంటుంది. ఇందులో కూడా మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లుంటుంది. ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై బ్యాంకులు 8.02 శాతం వడ్డీ అందిస్తున్నాయి. ఈ పధకం సెక్షన్ 80 సి పరిధిలో ఉంటుంది. ఐదేళ్ల కంటే తక్కువ వ్యవధికి ఎఫ్‌డి చేస్తే ట్యాక్స్ మినహాయింపు లభించదు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో గరిష్ట పరిమితి ఉంటే..ఎఫ్‌డిలో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.
Also read: EPFO Nominee Rules: పీఎఫ్ నామినీగా కొడుకు, కుమార్తెను చేర్చవచ్చా, ఎవరికి అవకాశం లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook