Realme 11 Pro 5G Series Launch: రియల్‌మి 11 ప్రో 5G సిరీస్ లాంచ్.. షారుఖ్ చేతిలో 200MP కెమెరా ఫోన్

Realme 11 Pro 5G Series Launch: రియల్‌మి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం రియల్‌మి  11 ప్రో 5G సిరీస్ ఫోన్ కెమెరాలో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఎలాంటి లైట్ కండిషన్‌లోనైనా ఫుల్ క్లారిటీతో ఫోటోలు, వీడియోలు వచ్చేలా ISOCELL HP3 టెక్నాలజీతో 200MP కెమెరాను ఇన్‌స్టాల్ చేశారు.

Written by - Pavan | Last Updated : May 25, 2023, 03:25 PM IST
Realme 11 Pro 5G Series Launch: రియల్‌మి 11 ప్రో 5G సిరీస్ లాంచ్.. షారుఖ్ చేతిలో 200MP కెమెరా ఫోన్

Realme 11 Pro 5G Series Launch: లో బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్స్ తయారు చేసే చైనాకు చెందిన రియల్‌మి కంపెనీ తాజాగా రియల్‌మి 11 ప్రో 5G సిరీస్ పేరుతో మరో సూపర్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతోంది. వచ్చే నెలలో రియల్‌మి 11 ప్రో 5G సిరీస్ లాంచ్ కానుండగా.. అంతకంటే ముందుగా రియల్‌మి కంపెనీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన షారుఖ్ ఖాన్‌ని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా అపాయింట్ చేసింది. 

రియల్‌మి కంపెనీ తాజాగా  ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. హలో న్యూ బ్రాండ్ అంబాసిడర్.. అంటూ ట్వీట్ చేసిన రియల్ మి కంపెనీ... " రీల్ నుంచి రియల్ " వరకు అంటూ షారుఖ్ ఖాన్ ఇకపై తమ రియల్‌మి బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తారనే విషయాన్ని ఆ ట్వీట్‌లో పేర్కొంది. వచ్చే నెలలో రియల్‌మి 11 ప్రో 5G సిరీస్‌తో మళ్లీ కలుద్దాం అంటూ రియల్‌మి ట్వీట్ చేసింది. 

రియల్‌మి 11 ప్రో 5G సిరీస్‌లో అంత ముఖ్యమైన ప్రత్యేకతలు ఏమున్నాయి..
రియల్‌మి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం రియల్‌మి  11 ప్రో 5G సిరీస్ ఫోన్ కెమెరాలో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఎలాంటి లైట్ కండిషన్‌లోనైనా ఫుల్ క్లారిటీతో ఫోటోలు, వీడియోలు వచ్చేలా ISOCELL HP3 టెక్నాలజీతో 200MP కెమెరాను ఇన్‌స్టాల్ చేశారు. బోల్డ్‌నెస్, బ్యూటీ, బ్రిలియన్స్.. ఇలా అన్నీ ఒకేచోట కలిపి కంపెనీ తీసుకొస్తున్న కొత్త సిరీస్ ఇది అని రియల్ మి కంపెనీ ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో పేర్కొంది.

రియల్‌మి 11 ప్రో 5G సిరీస్‌‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు చెప్పిన రియల్‌మి కంపెనీ.. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ ఎక్స్‌పీరియెన్స్‌లో ఓ సరికొత్త అనుభూతిని అందిస్తుంది అని ప్రకటించింది. అంతేకాదు.. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవడానికంటే ముందే.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది అంటే ఆ కంపెనీ ఈ సిరీస్‌కి ఎంత అధిక ప్రాధాన్యత ఇస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో రియల్‌మి ఫోన్స్ ప్రమోట్ చేయడం ఇదే తొలిసారి.

Trending News