Post office Schemes: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా, వివిధ ఆకర్షణీయమైన పథకాలతో లక్షలాది కస్టమర్లను కలిగి అందరికీ ప్రయోజనాలు, సేవలు అందిస్తున్న సంస్థ పోస్టాఫీసు. బ్యాంకులతో పోలిస్తే సులభమైన విధానాలు, ఆకర్షణీయమైన వడ్డీ ఉండటం వల్ల ఆదరణ పెరుగుతోంది.
పోస్టాఫీసులు అందిస్తున్న చాలా రకాల సేవింగ్ పథకాల్లో బాగా ఆదరణ పొంది..పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్న పధకం గురించి తెలుసుకుందాం. 5 ఏళ్ల కాల పరిమితికి పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ అందిస్తుంది పోస్టాఫీసు పథకం. ఈ త్రైమాసికానికి సంబంధించిన వడ్డీ కూడా ప్రభుత్వం ఇటీవల పెంచింది. ప్రస్తుతం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ ఆర్డీపై 6.5 వడ్డీ అందుతుంది.
10 వేలు పెట్టుబడిలో 7 లక్షల పొందడం ఎలా
పోస్టాఫీసు ఆర్డీ పధకంలో ఎవరైనా ఇన్వెస్టర్ ప్రతి నెలా 10 వేలు పెట్టుబడి పెడితే ఐదేళ్ల తరువాత 7 లక్షల 10 వేలు పొందవచ్చు. ఐదేళ్లలో మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం 6 లక్షలైతే వడ్డీతో కలుపుకుని మీకు 7 లక్షల 10 వేలు చేతికి అందుతుంది. అంటే వడ్డీ రూపంలో మీకు వచ్చేది 1 లక్షా 10 వేల రూపాయలు.
పోస్టాఫీసులో ఆర్డీ ఎక్కౌంట్ ఓపెన్ చేయాలంటే ప్రతి నెలా 1-15వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా 15వ తేదీలోగా సంబంధిత నగదు మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కౌంట్ 15వ తేదీన ఓపెన్ చేస్తే అదే రోజు ప్రతి నెలా ఆ డబ్బులు డిపాజిట్ చేయాలి. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌కు సంబంధించి కొత్త వడ్డీ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ ఆర్డీ పధకంలో వార్షిక వడ్డీ ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి లెక్కిస్తారు. ప్రతి త్రైమాసికం ప్రారంభంలో ప్రభుత్వం వడ్డీ నిర్ణయిస్తుంటుంది. పోస్టాఫీసు పధకాల కాల పరిమితి 5 ఏళ్లకు ఉంటుంది. మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook