Petrol Price Hiked: మరోసారి భారీగా పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ పై ఎంత భారం?

Petrol Price Hiked: దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. గత 10 రోజులగా ధరలను పెంచుతూ వస్తున్న చమురు సంస్థలు.. తాజాగా మరో 80 పైసలు పెంచారు. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 08:23 AM IST
Petrol Price Hiked: మరోసారి భారీగా పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ పై ఎంత భారం?

Petrol Price Hiked: దేశంలో మరోసారి ఇంధన ధరల మోత మోగుతోంది. పెట్రోల్, డీజిల్ పై ఏకంగా 80 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే గత 10 రోజుల్లో ఇలా ఇంధన ధరలు పెంచడం ఇది 9వసారి కావడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు 80 పైసల చొప్పున పెంచిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 101.81 ఉండగా.. డీజిల్ లీటర్ రూ. 93.07 వద్దకు చేరింది. 

మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ పెట్రోల్, డీజిల్ ధరలపై 84 పైసల చొప్పున పెంపు జరిగింది. దీంతో ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116.72గా ఉండగా.. డీజిల్ ధర రూ. 100.94కు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 

తెలంగాణలోని హైదరాబాద్ లో ఇంధన ధరలు పెరిగిన అనంతరం లీటర్ పెట్రోల్ రూ. 115.42గా ఉండగా.. డీజిల్ ను రూ. 101.58 ధరకు విక్రయిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెరిగింది. దీంతో అమరావతి పరిధిలో లీటర్ పెట్రోల్ ను రూ. 117.32కు చేరగా.. డీజిల్ రూ. 103.10 వద్దకు చేరుకుంది.  

Also Read: Whatsapp Update 2022: ఇకపై ఆ ఆండ్రాయిడ్, IOS స్మార్ట్ ఫోన్స్ లో వాట్సాప్ పనిచేయదు!

ALso Read: RBI New Rules:ఈఎంఐ చెల్లింపుల్లో కొత్త విధానం, తొలిసారిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News