Pan-Aadhaar Link Update: పాన్ కార్డు హోల్డర్లకు షాక్.. నిరుపయోగం కానున్న 13 కోట్ల పాన్ కార్డులు, మీ పాన్ కార్డ్ ఉందో చూసుకోండి

Pan-Aadhaar Link Update : కోట్లాది పాన్ కార్డు హోల్డర్లకు భారీ షాక్. కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు హోల్డర్లకు అత్యవసర నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రభావం 13 కోట్లమందిపై పడుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 8, 2023, 12:08 PM IST
Pan-Aadhaar Link Update: పాన్ కార్డు హోల్డర్లకు షాక్.. నిరుపయోగం కానున్న 13 కోట్ల పాన్ కార్డులు, మీ పాన్ కార్డ్ ఉందో చూసుకోండి

Pan-Aadhaar Linking Update: పాన్ కార్డు హోల్డర్లకు కీలకమైన అప్‌డేట్ ఇది. లేకపోతే కోట్లాది పాన్ కార్డు హోల్డర్లకు భారీ షాక్ తగలవచ్చు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ అత్యవసర నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కోట్లాది పాన్ కార్డులు నిరుపయోగం కానున్నాయి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అందించిన సూచనల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 61 కోట్ల పాన్ కార్డుల్లో ఇప్పటి వరకూ 48 కోట్లమందే తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేశారు. అంటే ఇంకా 13 కోట్లమంది పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాల్సి ఉంది. మార్చ్ 31లోగా తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే..వ్యాపార సంబంధ కార్యకలాపాలు నిర్వహించలేరు. సీబీడీటీ ఛైర్ పర్సన్ నితిన్ గుప్తా మీడియాకు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇప్పటికీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేయనివాళ్లు..మార్చ్ 31 గడువు తేదీలోగా చేయించకపోతే ఆ పాన్ కార్డులన్నీ నిరుపయోగం కానున్నాయి.

నిరుపయోగం కానున్న పాన్ కార్డు

కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని అనివార్యం చేసింది. దీనికోసం మార్చ్ 31, 2023 గడువు తేదీని నిర్ధారించింది. ఆధార్ కార్డుతో అనుసంధానం కాని వ్యక్తిగత పాన్ కార్డులు ఈ తేదీ తరువాత డీయాక్టివేట్ కానున్నాయి. అంతేకాదు..మార్చ్ 31లోగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు 1000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

ట్యాక్స్ ప్రయోజనం ఉండదు

సీబీడీటీ అందించిన సూచనల ప్రకారం..ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం విషయంలో చాలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది. గడువుతేదీని చాలాసార్లు పొడిగించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే..పాన్ కార్డు నిరుపయోగమై..ట్యాక్స్ ప్రయోజనాలు కోల్పోనున్నారు. ఎందుకంటే మార్చ్ 31 తరువాత సంబంధిత పాన్ కార్డు నిష్ప్రయోజనమౌతుంది. 

సీబీడీటీ గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పాన్ కార్డు డీయాక్టివేట్ అయితే..ఆ వ్యక్తి ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం నిర్ధారిత పరిణామాల్ని ఎదుర్కోవల్సి వస్తుంది.ఇందులో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ సమర్పించడం, పెండింగులో రిటర్న్స్ ప్రాసెస్ చేయడం వంటివి ఇకపై సాధ్యం కాదు. పాన్ కార్డును వ్యాపారవేత్తలకు ఓ కీలకమైన గుర్తింపుకార్డుగా పరిగణించనున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. 

Also read: DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, త్వరలో మరోసారి డీఏ పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News