Anasuya Bharadwaj: అనసూయలో భక్తి యాంగిల్.. ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయనిది..

Anasuya Bharadwaj: తెలుగు టీవీ యాంకర్ అనసూయ ఎపుడు ఏది చేసినా.. సంచలనమే. అనసూయలో భక్తి యాంగిల్ కూడా ఉంది. అంతేకాదు వీలైనపుడల్లా మన దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకుంది.

1 /8

అనసూయ భరద్వాజ్.. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకుంది. కేవలం ఆమెనే దర్శించుకుందా.. కుటుంబంతో చేసుకుందా అనేది తెలియాలి.

2 /8

అనసూయ పోస్ట్ చేసిన పిక్స్ లో ఎక్కడా కుటుంబ సభ్యులు లేరు. యాదాద్రిలో ఆమె ఫోటోలను ఎవరు తీసారనేది తెలియాల్సి ఉంది.  

3 /8

అంతేకాదు సాంప్రదాయ దుస్తుల్లో లక్ష్మీ నరసింహాస్వామి దర్శించుకొని అక్కడ మండపంలో కూర్చొని ఈ ఫోటోలను షేర్ చేసింది.

4 /8

అంతేకాదు ఆలయ ప్రాంగణంలో శిల్ప సౌందర్యాన్ని కూడా అభిమానులతో పంచుకుంది.

5 /8

అనసూయ విషయానికొస్తే.. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా ఫేమస్ అయింది.

6 /8

జబర్దస్త్ షో తర్వాత సినిమాల్లో అవకాశాలను కొల్లగొట్టింది. అంతేకాదు నటిగా కూడా అనసూయ సత్తా చాటింది.

7 /8

ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, గాడ్ ఫాదర్ సహా పలు చిత్రాల్లో ఈమె పాత్రకు ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా రజాకార్ చిత్రంలోని యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. 

8 /8

ఏది ఏమైనా ఎపుడు గ్లామర్ ఫోటోలనే కాకుండా ఆధ్యాత్మిక పరమైన ఫోటోలతో కూడా అనసూయ అలరిస్తూ ఉండటం విశేషం.