New year offers on iPhones: యాపిల్ వాచెస్, మ్యాక్‌బుక్స్, ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు, డిసెంబర్ 31 వరకే

New year offers on iPhone: ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. యాపిల్ సంస్థ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ లభించనుంది. విజయ్ సేల్స్ యాపిల్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. ఆ డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 26, 2021, 07:46 AM IST
New year offers on iPhones: యాపిల్ వాచెస్, మ్యాక్‌బుక్స్, ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు, డిసెంబర్ 31 వరకే

New year offers on iPhone: ఐఫోన్ వినియోగదారులకు శుభవార్త. యాపిల్ సంస్థ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ లభించనుంది. విజయ్ సేల్స్ యాపిల్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. ఆ డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రతిష్ఠాత్మక యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లపై విజయ్ సేల్స్ (Vijay Sales) భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్ 13, ఐఫోన్ 12 (iPhone 12) , ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచ్ వంటి చాలా రకాలు ఈ ఆఫర్ పరిధిలో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్ మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలుంది. డిసెంబర్ 31 వరకూ ఐఫోన్ (iPhone) వివిధ రకాల మోడల్స్‌పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 

ఐఫోన్ 13 (iPhone13) ధర 128 జీబీ ధర ఇండియాలో 75 వేల 9 వందల రూపాయలకే లభిస్తుంది. ఈ మోడల్ అసలు ధర 79 వేల 9 వందల రూపాయలు. 4 వేల రూపాయల డిస్కౌంట్‌కు తోడు హెచ్‌డీఎఫ్‌సీ కార్డు హోల్డర్లకు అదనంగా  6 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో ఐఫోన్ 13 మిని 67 వేల 4 వందల రూపాయలకే లభించనుంది. ఇక ఐపోన్ 13 ప్రో మ్యాక్స్ ధర ఇండియాలో 1 లక్షా 13 వేల 4 వందల రూపాయలకు లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై మరో 5 వేల రూపాయలు అదనంగా డిస్కౌంట్ లభించనుంది. ఐఫోన్ 12 ధర 61 వేల 299 రూపాయలకు పడిపోయింది.హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై అదనంగా మరో 5 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఐఫోన్ 11 అయితే కేవలం 47 వేల 4 వందల రూపాయలకే లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై అదనంగా మరో 4 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. 

ఇక ఐప్యాడ్ (iPad) 9వ జనరేషన్ 29 వేల 9 వందల రూపాయలకే లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై అదనంగా మరో 3 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తోంది. ఐప్యాడ్ ఎయిర్ 50 వేల 9 వందల రూపాయలకు లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై అదనంగా మరో 4 వేల రూపాయలు డిస్కౌంట్ లభించనుంది. ఐప్యాడ్ ప్రో ధర 67 వేల 5 వందల రూపాయలకే అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై అదనంగా మరో 4 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తోంది. 

ఇక యాపిల్ (Apple) వాచ్ సిరీస్ 7 అయితే ఇండియాలో కేవలం 39 వేల 100 రూపాయలకే లభించనుంది. అసలు ధర 41 వేల 9 వందల రూపాయలుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై అదనంగా మరో 3 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. యాపిల్ వాచ్ ఎస్ఈ 25 వేల 9 వందల రూపాయలకు అందుబాటులో ఉంది. ఇక యాపిల్ మ్యాక్‌బుక్ (Apple MacBook) ఎయిర్ ఎంఐ ధర ఇండియాలో ప్రస్తుతం 83 వేల 610 రూపాయలు మాత్రమే. ఇదే మోడల్ లాంచ్ ధర 92 వేల 9 వందల రూపాయలుగా ఉంది. అటు మ్యాక్‌బుక్ ప్రో ఎంఐ ప్రో ధర 1 లక్షా 81 వేల 200 వందలతో ప్రారంభమవుతుంది. ఎయిర్ పాడ్స్ (AirPods) మూడవ జనరేషన్ ఇప్పుడు 17 వేల 3 వందలకే లభిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై అదనంగా 2 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. 

Also read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News