Multibagger Stock: మల్టీబ్యాగర్ స్టాక్‌గా పెన్నీ స్టాక్, ఏడాదిలో 20 లక్షలైన 1 లక్ష రూపాయలు

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో ఎన్నో షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్, కొన్ని పెన్నీ స్టాక్స్ ఉంటాయి. పెన్నీ స్టాక్స్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పెన్నీ స్టాక్ మాత్రం మల్టీ బ్యాగర్ స్టాక్‌గా మారింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 5, 2023, 08:41 PM IST
Multibagger Stock: మల్టీబ్యాగర్ స్టాక్‌గా పెన్నీ స్టాక్, ఏడాదిలో 20 లక్షలైన 1 లక్ష రూపాయలు

షేర్ మార్కెట్‌లో ఉండే పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి అనేది రిస్క్‌తో కూడి ఉంటుంది. ఒక్క ఉదుపులో పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఎక్కువ రిస్క్ తీసుకునే వ్యాపారులు పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతుంటారు. ఆ వివరాలు మీ కోసం..

పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఇన్వెస్టర్ అదృష్టం ఎలా మారుతుందనేది తెలుసుకోవాలంటే రేమంగ్ రిసోర్సెస్ షేర్లు పరిశీలిస్తే అర్ధమౌతుంది. బీఎస్ఈలో లిస్టింగ్ అయిన స్టాక్ గత ఏడాదిలో దాదాపుగా ఒక్కొక్క ఈక్విటీ షేర్‌పై 3.25 రూపాయలు పెరిగి.. 66 రూపాయలు పెరిగింది. ఇన్వెస్టర్లకు దాదాపు 19 వందల రిటర్న్ లభిస్తుంది.

గత వారంలో స్మాల్‌క్యాప్ స్టాక్ రెండు సందర్భాల్లో అప్పర్ సర్క్యూట్‌కు చేరింది. ఈ కాలంలో షేర్ హోల్డర్లకు 5.50 శాతం కంటే ఎక్కువ రిటర్న్ అందించింది. గత నెలలో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ 56.50 రూపాయల్నించి 66 రూపాయలు పెరిగింది. గత నెలలో దాదాపు 15 శాతం వృద్ధి నమోదైంది. మల్టీబ్యాగర్ స్టాక్ 45.20 నుంచి 66 రూపాయలు షేర్ పెరిగింది. దీంతో షేర్ హోల్డర్లకు 45 శాతం రిటర్న్ లభించింది.

హేమంగ్ రిసోర్సెస్ షేర్ ఓ వారం రోజుల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే..ఇవాళ ఆ షేర్ 1.05 లక్షలయ్యేది. ఒకవేళ ఇన్వెస్టర్ ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో నెల రోజుల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే..ఇవాళ దాని విలువ 1.15 లక్షలయ్యేది. అదే విధంగా 6 నెలల క్రితం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుంటే..ఇవాళ ఆ షేర్ విలువ 1.45 లక్షలయ్యేది. అదే ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే..ఇవాళ అది ఏకంగా 20 లక్షలయ్యేది. అంటే ఇన్వెస్టర్‌కు జాక్ పాట్ తగిలినట్టే. 

హేమంగ్ రిసోర్సెస్ షేర్ బీఎస్ఈలో ట్రేడింగ్‌కు సిద్ధంగా ఉంది. ఇవాళ ఆ షేర్ విలువ 17,549 రూపాయలుంది. 20 రోజుల క్రితం 34, 284 రూపాయలుండింది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ట ధర 3.16 రూపాయలు కాగా 52 వారాల గరిష్ట ధర 80.90 రూపాయలుంది.

Also read: Car Discount Offers: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. ఈ మూడు కార్లపై 65 వేల తగ్గింపు! లిమిటెడ్ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News