Multibagger IPO: కేవలం 6 నెలల వ్యవధిలో 120 శాతం లాభాల్ని అందించిన షేర్, ఎంతో తెలుసా

Multibagger IPO: షేర్ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్స్ ఊహించని లాభాల్ని ఇస్తుంటాయి. అలాంటిదే ఓ కంపెనీ షేర్ 6 నెలల వ్యవధిలో 120 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2022, 05:55 PM IST
Multibagger IPO: కేవలం 6 నెలల వ్యవధిలో 120 శాతం లాభాల్ని అందించిన షేర్, ఎంతో తెలుసా

స్వల్పకాలంలో లేదా ఊహించని లాభాల్ని ఇచ్చే షేర్లను మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా పిలుస్తారు. 6 నెలల వ్యవధిలో ఊహించని లాభాల్ని అందించిన ఈ షేర్ ఇప్పుడు లైఫ్ టైమ్ హైకు కూడా చేరుకుంది. ఆ వివరాలు మీ కోసం..

వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ కంపెనీ షేర్ 2022లోని మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ కంపెనీ షేర్ 2022లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ అయింది. జూలై నుంచి ఈ షేర్ విలువ పెరుగుతూ పోతోంది. ఇవాళ ఉదయం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంది. ఇవాళ షేర్ మార్కెట్ తెరవగానే..కొన్ని క్షణాల్లోనే వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ షేర్ ఎన్ఎస్ఈపై 774.85 రూపాయలు, బీఎస్ఈపై 774.75 రూపాయల లైఫ్ టైమ్ హై చేరుకుంది. 

వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ షేర్ మే 24వ తేదీ 2022న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ అయింది. లిస్టింగ్ అనంతరం స్టాక్ అప్‌ట్రెండ్‌లో సాగింది. గత నెలలో ఇది స్మార్ట్ క్యాప్ స్టాక్ విభాగంలో దాదాపు 575 రూపాయల్నించి 775 రూపాయలకు చేరుకుంది. ఈ స్వల్ప కాలంలో 35 శాతం పెరుగుదల నమోదు చేసింది. లిస్టింగ్ అయిన 6 నెలల్లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపుగా 355 రూపాయల్నించి 775 రూపాయలకు చేరుకుంది. అంటే ఏకంగా 120 శాతం లాభాల్ని ఇచ్చింది.

వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీని ఇండియన్ షేర్ మార్కెట్‌లో 2022లో తెరిచారు.165.42 కోట్ల ఫండ్ కోసం 310 - 326 రూపాయల ధరపై లాంచ్ అయింది. బీఎస్ఈలో ఈ షేర్ 335 రూపాయలకు లిస్ట్ అయితే..ఎన్ఎస్ఈలో 337.50 రూపాయలకు లిస్ట్ అయింది. ఆ తరువాత ఈ మల్టీబ్యాగర్ స్టాక్ విలువ పెరగడంతో..బీఎస్ఈపై 351.75 రూపాయలు ఎన్ఎస్ఈపై 354.35 రూపాయలకు చేరుకుంది. 

ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ విలువ 1560 కోట్లుగా ఉంది. ప్రస్తుతం అంతకంతకూ పెరుగుతూ లైఫ్ టైమ్ హైకు చేరుకుంది.

Also read: iPhone 13: మరోసారి తగ్గిన ఐఫోన్ 13 ధర, ఊహించని అతి తక్కువ ధరకు ఐఫోన్ 13 లభ్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News