Multibagger Share: 5 రూపాయల షేర్‌పై ఊహించని లాభాలు, 6 నెలల్లో లక్ష రూపాయలకు 15 లక్షల లాభం

Multibagger Share: షేర్ మార్కెట్‌లో చాలాకాలం తరువాత మరో మల్టీబ్యాగర్ స్టాక్ అద్భుతాలు సృష్టించింది. కేవలం 5 రూపాయలు ఆ కంపెనీ షేర్..1 లక్ష రూపాయల్ని 15 లక్షలు చేసేసింది. ఇంకా అదే ఊపు కొనసాగిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 13, 2023, 03:51 PM IST
Multibagger Share: 5 రూపాయల షేర్‌పై ఊహించని లాభాలు, 6 నెలల్లో లక్ష రూపాయలకు 15 లక్షల లాభం

Multibagger Share: షేర్ మార్కెట్ అనేది ఓ లోతైన ప్రపంచం. కొన్ని షేర్లు ఊహించని లాభాల్ని ఆర్జిస్తే, మరికొన్ని షేర్లు పాతాళానికి పడిపోతుంటాయి. సరైన అవగాహన, సకాలంలో నిర్ణయమనేది షేర్ మార్కెట్‌లో అనుకూలిస్తుంది. గత నెల షేర్ మార్కెట్‌లో కొన్ని షేర్లు ఊహించని లాభాల్ని కురిపించాయి. అందులో ఒకటి ఈ షేర్.

ఇదొక పెన్నీ స్టాక్. ఈ షేర్ విలువ కేవలం 5 రూపాయలు. కేవలం ఆరు నెలల వ్యవధిలో ఊహించిన లాభాల్ని తెచ్చిపెట్టింది ఈ షేర్. అంటే ఆరు నెలల క్రితం ఈ కంపెనీ షేర్‌లో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ షేర్ అమ్మకుండా ఉండుంటే..ఇప్పుడా లక్ష రూపాయల విలువ 15 లక్షలయింది. అంటే 15 రెట్లు లాభమైంది. గ్లోబ్ కమర్షియల్స్ లిమిటెడ్ అనే ఈ కెంపెనీ అగ్రికల్చర్ కమోడిటీస్, ఈ కామర్స్ సొల్యూషన్స్ వ్యాపారం చేస్తుంది.

5 రూపాయల్నించి 39 రూపాయలకు పెరిగిన షేర్

గ్లోబ్ కమర్షియల్స్ స్టాక్ ఆరు నెలల్లోనే 5 రూపాయల్నించి 39 రూపాయలకు పెరిగిపోయింది. గత 6 నెలల్లో ఇన్వెస్టర్లకు 1కి 1 చొప్పున బోనస్ షేర్ ఇచ్చింది. గ్లోబ్ కమర్షియల్స్ షేర్ ఆరు నెలల క్రితం అంటే 2022 అక్టోబర్ 7న బీఎస్ఈలో 5 రూపాయలు ఉంది. ఆ సమయంలో ఎవరైనా ఇన్వెస్టర్ 1 లక్ష రూపాయలు పెట్టబడి పెట్టుంటే 20 వేల షేర్లు లభించేవి.

ఆ తరువాత గ్లోబ్ కమర్షియల్స్ 2023 జనవరిలో ఇన్వెస్టర్లకు అంటే షేర్ హోల్డర్లకు 1 కి 1 చొప్పున షేర్ బోనస్‌గా అందించింది. బోనస్ షేర్ రావడంతో 20 వేల షేర్లు కాస్తా 40 వేల షేర్లయ్యాయి. నిన్న బుధవారం మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి షేర్ 39 రూపాయలకు చేరుకుంది. 39 రూపాయల చొప్పున 40 వేల షేర్ల విలువ 15.60 లక్షలయ్యేది. 

400 శాతం పెరిగిన షేర్ ధర

గ్లోబ్ కమర్షియల్స్ షేర్ ఏప్రిల్ 13, 2022న 7.68 రూపాయలుంది. ఏప్రిల్ 12, 2023 నాటికి అంటే ఏడాదికి పెరిగి 39 రూపాయలకు చేరుకుంది. కంపెనీ షేర్ గత ఏడాదిలో 407 శాతం వృద్ధి నమోదు చేసింది. గ్లోబ్ కమర్షియల్స్ షేర్ 52 వారాల గరిష్ట ధర 52.60 రూపాయలు కాగా కనిష్ట ధర 4.54 రూపాయలుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 23.5 కోట్లుంది.

Also read: Maruti Suzuki Swift 2023: ఈ విలాసవంతమైన కారు కేవలం 1 లక్షకే మీ సొంతం.. కస్టమర్లను ఆకర్షిస్తోన్న స్పోర్టీ లుక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News