New Maruti Swift: మారుతి నుంచి కొత్త స్విఫ్ట్ త్వరలోనే, మైలేజ్ వింటే షాక్, లీటరుకు 40 కిలోమీటర్లు

New Maruti Swift: మారుతి సుజుకి. దేశ ప్రజలకు ఏళ్ల తరబడి నమ్మకమైన బ్రాండ్. ఇప్పుడీ కంపెనీ 5వ జనరేషన్‌లో ప్రవేశిస్తోంది. మారుతి సుజుకి నుంచి కొత్త స్విఫ్ట్ ప్రపంచ మార్కెట్‌లో డెబ్యూ ఇస్తోంది. వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 20, 2023, 01:28 PM IST
New Maruti Swift: మారుతి నుంచి కొత్త స్విఫ్ట్ త్వరలోనే, మైలేజ్ వింటే షాక్, లీటరుకు 40 కిలోమీటర్లు

New Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్ మోడల్ ఏళ్ల తరబడి  నమ్మకమైన మోడల్ కారుగా మార్కెట్‌లో ఉంది. 2005 మే నెలలో లాంచ్ అయిన మారుతి సుజుకి స్విఫ్ట్ ఇండియా-జపాన్ మార్కెట్‌లో గణనీయంగా విక్రయాలు జరుపుతూ వస్తోంది. ఇప్పుడు ఇందులో సరికొత్త మోడల్ త్వరలో ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ కానుంది. 

మారుతి సుజుకి స్విఫ్ట్‌లో గత 17-18 ఏళ్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ, కొత్త పీచర్లు ఆపాదించుకుంటూ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ ట్రేన్‌తో 5వ జనరేషన్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పడీ హ్యాచ్‌బ్యాక్ కారు అక్టోబర్ నెలలో గ్లోబల్ డెబ్యూ ఇవ్వనుంది. ఆ తరువాత 2024 ప్రారంభంలో ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ కొత్త మోడల్ కారు సరికొత్త ఫీచర్లు అందుబాటులో తీసుకురానుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ 5వ జనరేషన్ మోడల్‌లో కొత్త 1.2 లీటర్, 3 సిలెండర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ , బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు లీటర్‌కు 35-40 కిలోమీటర్ల భారీ మైలేజ్ ఇవ్వనుంది. ఇది మార్కెట్‌లో లాంచ్ అయితే ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు ఇదే కానుంది.

ఇదే హ్యాచ్‌బ్యాక్ మునుపటి వేరియంట్ లో 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది లీటర్‌కు 23.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు గరిష్టంగా 89 బీహెచ్‌పి పవర్, 113 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 

కొత్త స్విఫ్ట్ ఫీచర్లు

ఈ కారు ఇంటీరియర్‌లో చాలా మార్పులుంటాయని తెలుస్తోంది. కొత్త 2024 మారుతి స్విఫ్ట్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఓటీఏ, సుజుకి వాయిస్ అసిస్ట్‌తో పాటు కొత్త స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. కొత్త ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ ఉంటుంది. దాంతోపాటు 360 డిగ్రీల కెమేరా ఫీచర్లు ఉంటాయి.

కొత్త 2024 మారుతి స్విఫ్ట్ మరింత యాంగ్యులర్‌గా కన్పించనుంది. డిజైన్‌లో కొత్తగా మార్పులు జరిగాయి. ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ బంపర్, కొత్త ఎల్ఈడీ ఎలిమెంట్స్‌తో పాటు స్లీక్ హెడ్ ల్యాంం‌ప్, ఫాంక్స్ ఎయిర్‌వెంట్, కొత్త బాడీ ప్యానల్, ఫ్లేయర్డ్ వీల్ ఆర్చ్, బ్లాక్డ్ అవుట్ పిల్లర్, రూఫ్ మౌంటెడ్ స్పైలర్ ఇందులో ప్రత్యేకత. 

Also read: Jio Prepaid Offers: ఇప్పుడు జియో ప్రీ పెయిడ్‌తో కూడా నెట్‌ఫ్లిక్ ఉచితం, ఈ రెండు ప్లాన్స్‌కే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News