Maruti Suzuki Jimny Discounts: దసరా పండగ లేదా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? లేదంటే, ప్రత్యేకించి మారుతి సుజుకి జిమ్నీ ఎస్‌యూవి కారు కొనేందుకే ప్లాన్ చేస్తున్నారా ? ఐతే ఈ గుడ్ న్యూస్ కచ్చితంగా మీ కోసమే. ఔను, ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ అయిన మారుతి సుజుకి జిమ్నీ ఎస్‌యూవి కారుపై మారుతి సుజుకి బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.
నొయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో వంటి వేదికపై అట్టహాసంగా లాంచ్ అయినప్పటికీ.. మారుతి సుజుకి జిమ్నీ ఎస్‌యూవి కారుకి అంతగా పాపులారిటీ రాలేదు. మరీ ముఖ్యంగా మహింద్రా అండ్ మహింద్రా తయారు చేసిన థార్ కారుతో పోలిస్తే.. మారుతి సుజుకి జిమ్నీ ఎస్‌యూవి కారు వెనుకబడిపోయిందనే టాక్ కూడా ఉంది. అందుకే జిమ్నీ కారును మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మారుతి మరో కొత్త ఐడియాతో కస్టమర్స్ ముందుకొచ్చింది.
మారుతి సుజుకి జిమ్నీ ఎస్‌యూవి కారు అమ్మకాలు పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా ఈ దసరా, దీపావళి పండగల సీజన్‌ని ఉపయోగించుకోవాలని భావించిన మారుతి సుజుకి.. అందులో భాగంగానే జిమ్నీ కారుపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ గుప్పించింది. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు మారుతి సుజుకి కంపెనీ వెల్లడించింది. జిమ్నీ జెటా ఎంటీ, జెటా ఎటీ, ఆల్ఫా ఎంటీ, ఆల్ఫా ఏటీ .. ఇలా ఈ నాలుగు రకాల వేరియంట్స్‌పై ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. కాకపోతే ఈ బంపర్ ఆఫర్ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది అని మారుతి సుజుకి స్పష్టంచేసింది.
అలానే, మారుతి సుజుకి జిమ్నీ జెటా వేరియంట్ కారుపై రూ. 50 వేల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ కూడా అందిస్తున్నట్టు మారుతి సుజుకి తమ ప్రకటనలో పేర్కొంది. మారుతి సుజుకి జిమ్నీ లాంచ్ అయిన తరువాత ఇలా డిస్కౌంట్ ఆఫర్స్ అందివ్వడం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి : మరో 3 కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురానున్న హొండా.. అవేంటంటే..?
మారుతి సుజుకి జిమ్నీలో బేసిక్ వేరియంట్ అయినటువంటి జెటా ఎంటీ కారు ఎక్స్-షోరూం ధర రూ. 12.74 లక్షల నుండి ప్రారంభం అవుతుండగా.. టాప్ ఎండ్ వేరియంట్ అయినటువంటి ఆల్ఫా ఏటీ కారు ఎక్స్-షోరూం ధర 15.05 వరకు ఉంది. మొత్తం 7 కలర్లలో మారుతి సుజుకి జిమ్నీ కారు లభిస్తుండగా.. అందులో 5 సింగిల్ కలర్స్ కాగా మరో రెండు డ్యూయల్ కలర్ షేడ్స్ ఉన్నాయి. 5 స్పీడ్ మాన్వల్ ట్రాన్స్‌మిషన్ కారు 16.94 kmpl మైలేజ్ అందిస్తుండగా.. 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కారు 16.39 kmpl మైలేజ్ అందిస్తుంది.
ఇది కూడా చదవండి : Maruti Suzuki: సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీగా కొత్త స్విఫ్ట్ త్వరలో లాంచ్, మైలేజ్ వింటే ఇక ఆగరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి