Maruti Suzuki Discount: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఇటీవలే మార్కెట్లోకి కొన్ని కొత్త మోడళ్లను విడుదల చేసింది. జిమ్నీ, ఫ్రాంక్స్ తో పాటు ఇతర మోడళ్లను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీంతో దేశంలో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించినట్లు అయ్యింది. ఈ కొత్త మోడళ్లలో కెల్లా ఫ్రాంక్స్ వేరియంట్ సెప్టెంబరు నెలలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న పది కార్లలో ఒకటిగా పేరొందింది. దీంతో పాటు అమ్మకాలను మరింత పెంచేందుకు సుజుకి కంపెనీ తమ Swift, Wagon R, Alto K10 వంటి వాటిపై మరింత డిస్కౌంట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే తగ్గింపును ఇప్పుడు Baleno, Ignis, Ciazతో సహా Nexa మోడల్‌లపై రూ. 65,000 వరకు తగ్గింపుతో కార్లను విక్రయిస్తోంది.
మారుతీ సుజుకి బాలెనో
మారుతి సుజుకి బాలెనో అనే కారు.. భారతీయ మార్కెట్లో గణనీయమైన ప్రజాదరణ పొందుతోంది. వినియోగదారుల అవసరాలను తీర్చే విధంగా.. మార్కెట్లోని టాటా Altroz, Hyundai i20, Volkswagen Polo వంటి కార్లతో పోటీపడుతోంది.
మారుతీ సుజుకి బాలెనో కారుపై సెప్టెంబరు నెలలో రూ. 35,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ తో పాటు వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్స్ సహా ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, పండుగ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా సెప్టెంబరు 2 నుంచి సెప్టెంబరు 19 వరకు మధ్య ఈ మోడల్ కారును బుక్ చేసుకున్న వారు అదనంగా మరో రూ. 5 వేలు తగ్గింపును పొందవచ్చు.
Also Read: Chandrababu Bail: ఎట్టకేలకు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు, విచారణ ఎప్పుడంటే
మారుతీ సుజుకి సియాజ్
మారుతీ సుజుకి కంపెనీ నుంచి మరో మోడల్ కారు సియాజ్ మరింత తగ్గింపుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ ప్రీమియమ్ సెడాన్ మోడల్ పై దాదాపుగా రూ. 48,000 తగ్గింపుతో అమ్మకానికి ఉంచారు. ఐదు వంతుల స్పీడ్ మాన్యువల్ లేదా నాలుగు స్పీడ్ కన్వర్టర్ గేర్ బాక్స్ తో పనిచేసే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు అందుబాటులోకి వస్తుంది. మార్కెట్లోని హ్యూందాయ్ వెర్నా, హోండా సిటీ, స్కోడా స్లావియా వంటి మోడళ్లతో మారుతీ సుజుకి సియాజ్ పోటీ పడుతోంది.
మారుతీ సుజుకి ఇగ్నిస్
మారుతి సుజుకి కంపెనీ రిలీజ్ చేసిన ఇగ్నిస్ కారుపై గరిష్టంగా రూ.65,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. వాటిలోని ఆటోమేటిక్ మోడల్స్ పై రూ. 55 వేల వరకు తగ్గింపు కూడా వర్తిస్తుంది. నెక్సా లైనప్ లోని ఇగ్నిస్ ను రూ. 5.84 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ. 8.16 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు విక్రయిస్తున్నారు.
Also Read: Janasena-Tdp: ప్యాకేజ్ బంధం ప్రభావమే ఈ పొత్తు, జనసేన-టీడీపీ పొత్తుపై వైసీపీ విమర్శలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook