Car Discount Offers: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. ఈ మూడు కార్లపై 65 వేల తగ్గింపు! లిమిటెడ్ ఆఫర్

Discounts of up to Rs 65,000 on Maruti Suzuki Cars in 2023 January. కొత్త సంవత్సరం 2023 నేపథ్యంలో మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెక్సా శ్రేణిలోని కొన్ని మోడళ్లపై తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది. 

Written by - P Sampath Kumar | Last Updated : Jan 6, 2023, 02:52 PM IST
  • మారుతి సుజుకి బంపర్ ఆఫర్
  • ఈ మూడు కార్లపై 65 వేల తగ్గింపు
  • లిమిటెడ్ ఆఫర్
Car Discount Offers: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. ఈ మూడు కార్లపై 65 వేల తగ్గింపు! లిమిటెడ్ ఆఫర్

Maruti Suzuki Cars 2023 Discounts and Offers: 'మారుతి సుజుకి' పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణ ఆసియాలో కార్లలను రూపొందించే సంస్థలలో మొదటి స్థానంలో ఉంది. కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి సంస్థ 2022లో దూసుకుపోయింది. 2022 ప్రారంభంలో విడుదల అయిన బాలెనో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ బాగా అమ్ముడయింది. అయితే కొత్త సంవత్సరం నేపథ్యంలో మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన నెక్సా (Nexa) శ్రేణిలోని కొన్ని మోడళ్లపై తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది. 

మారుతి ఇగ్నిస్ (Maruti Ignis), మారుతి బాలెనో (Maruti Baleno) మరియు మారుతి సియాజ్ (Maruti Ciaz) కార్లపై మారుతి సుజుకి కంపెనీ ఆఫర్‌లను ప్రకటించింది. 2022 (MY22) మోడల్ మరియు 2023 (MY23) మోడల్ రెండింటిలోనూ ఆఫర్‌లు ఉన్నాయి. అయితే 2022  మోడల్‌పై ఎక్కువ తగ్గింపు ఉండగా.. 2023 మోడల్‌లో తక్కువ తగ్గింపు ఉంది. MY22 మోడల్‌లపై క్యాష్ డిస్కౌంట్ జనవరి 16 వరకు మాత్రమే ఉంది. అయితే MY23 మోడల్‌లపై జనవరి మొత్తం ఆఫర్‌లు ఉన్నాయి.

Maruti Ignis Offers:
మారుతి ఇగ్నిస్‌పై రూ. 30,000 (MY22) మరియు రూ. 15,000 (MY23) వరకు నగదు తగ్గింపు ఉంది. అదే సమయంలో ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ రెండింటిపై వరుసగా రూ. 15,000 మరియు రూ. 5,000 వరకు ఉంటాయి. MY22 మోడల్‌పై మొత్తం రూ. 50,000 మరియు MY23 మోడల్‌పై మొత్తం రూ. 35,000 ఆఫర్ అందించబడుతుంది. మారుతి ఇగ్నిస్ ధర రూ. 5.35 లక్షల నుంచి రూ. 7.72 లక్షల మధ్య ఉంటుంది.

Maruti Baleno Offers:
మారుతి బాలెనో MY22పై మాత్రమే ఆఫర్ ఉంది. ఈ కారుపై కంపెనీ రూ.15 వేల వరకు మాత్రమే క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్ కూడా టాప్ ఆల్ఫా MT వేరియంట్‌పై మాత్రమే. MY23 మోడల్‌పై ఎటువంటి ఆఫర్ లేదు. మారుతి బాలెనో ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.71 లక్షల వరకు ఉంది.

Maruti Ciaz Offers:
మారుతి సియాజ్ (MY22)పై రూ. 35,000 వరకు నగదు తగ్గింపు ఉంది. అయితే MY23 మోడల్‌పై తగ్గింపు లేదు. ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రెండింటిపై వరుసగా రూ. 25,000 మరియు రూ. 5,000 వరకు ఉన్నాయి. దాంతో MY22 మోడల్‌పై రూ. 65,000 మరియు MY23 మోడల్‌పై రూ. 30,000 ప్రయోజనం పొందవచ్చు. సియాజ్ కారు ధర రూ. 8.99 లక్షల నుంచి రూ. 11.98 లక్షల వరకు ఉంది.

Also Read: Cheapest Diesel Cars: సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ కార్ల కంటే బెటర్ ఆప్షన్ .. 8 లక్షల కంటే తక్కువ ధరలో 3 డీజిల్ కార్లు!  

Also Read: Jupiter Rise 2023: 2023లో బృహస్పతి ఉదయం.. ఈ 4 రాశుల వారికి పండగేపండగ! డబ్బు వర్షం పక్కా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News