Maruti Jimny Bookings Crossed 30000: మారుతి సుజుకి జిమ్ని కోసం ఎగబడుతున్న జనం

Maruti Jimny Car Booking Price: ఇండియాలో పేరొందిన ఆటో మొబైల్ తయారీ కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకీ SUV కార్ల సెగ్మెంట్‌ను షేక్ చేయనుందా అంటే అవుననే తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీని లాంచ్ చేయడంతో SUV కార్ల మార్కెట్ ని ఒక ఊపు ఊపడానికి మారుతి సుజుకి రెడీ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2023, 05:19 AM IST
Maruti Jimny Bookings Crossed 30000: మారుతి సుజుకి జిమ్ని కోసం ఎగబడుతున్న జనం

Maruti Jimny Car Booking Price: ఇండియాలో పేరొందిన ఆటో మొబైల్ తయారీ కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకీ SUV కార్ల సెగ్మెంట్‌ను షేక్ చేయనుందా అంటే అవుననే తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీని లాంచ్ చేయడంతో SUV కార్ల మార్కెట్ ని ఒక ఊపు ఊపడానికి మారుతి సుజుకి రెడీ అవుతోంది. మారుతి సుజుకి జిమ్నీ జూన్ 7వ తేదీ నాడు మార్కెట్లోకి లాంచ్ అవుతోంది. మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా లాంటి కార్లకు గట్టి పోటీనివ్వనున్న ఈ కారు ఈ ఏడాది ఆరంభంలో నొయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేసింది. 

ఇప్పటికే 30,000 దాటిన మారుతి సుజుకి జిమ్నీ
మారుతి సుజుకి జిమ్నీ రాక కోసం కస్టమర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లాంచ్‌ అవడానికంటే ముందే, 30,000 కంటే ఎక్కువ కార్లు బుకింగ్‌ అయ్యాయని మారుతి సుజుకి ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ చీఫ్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అంతేకాదండోయ్.. కారు ధర ఇంకా వెల్లడించక ముందే 30 వేల మందికి పైగా కస్టమర్స్ ఈ కారుని కొనేందుకు ముందుకొచ్చారంటే మారుతి సుజుకి జిమ్నికి మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

జిమ్నీని బుక్ చేసుకోవాలంటే టోకెన్ ఎమౌంట్ ఎంత చెల్లించాల్సి ఉంటుంది..
మారుతి సుజుకి జిమ్నీ కారుని బుక్ చేసుకోవాలనుకుంటే, కంపెనీ వెబ్‌సైట్‌ని విజిట్ చేసి రూ. 25,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా మారుతి సుజుకి అధికారిక డీలర్ వద్ద సైతం కారును బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణంతో కారు వద్దని అనుకుంటే.. నిర్ణీత వ్యవధిలోపు రూ. 500 అపరాధ రుసుం చెల్లించి కారు బుకింగ్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఇది కూడా చదవండి : Maruti Suzuki Jimny: ఇండియన్ మార్కెట్లోకి మారుతి సుజుకి జిమ్నీ.. ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ఇది కూడా చదవండి : Tata Altroz CNG Car: అద్దిరిపోయే అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News