Maruti eVX 2024: దీన్ని తలదన్నే కారు లేదు గురూ.. మారుతి నుంచి మొదటి EV కారు.. సూపర్‌ ఫీచర్స్‌!

Maruti eVX 2024: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఎలక్ట్రిక్‌ కారును త్వరలోనే మారుతి సుజుకి లాంచ్‌ చేయబోతోంది. ఇది అద్భుతమైన 550 కి.మీ మైలేజీతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 26, 2024, 01:49 PM IST
Maruti eVX 2024: దీన్ని తలదన్నే కారు లేదు గురూ.. మారుతి నుంచి మొదటి EV కారు.. సూపర్‌ ఫీచర్స్‌!

 

Maruti eVX 2024: భారత్‌ మార్కెట్‌లో అత్యంత ప్రసిద్ధి పొందిన ఆటో మొబైల్‌ కంపెనీల్లో మారుతి సుజుకి ఒకటి. ఈ కంపెనీ ఎప్పటి కప్పుడు ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లో కొత్త కార్లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. 2023 సంవత్సరంలో మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పోలో eVX ఎలక్ట్రిక్ SUV పరిచయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ మరో సారి జపాన్ మొబిలిటీ షోలో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. అయితే ఈ మారుతి సుజుకి త్వరలోనే మరో కొత్త మోడల్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇది అద్భుతమైన డిజైన్‌తో పాటు ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మోడల్‌ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే:
మారుతి సుజుకి తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ కారును త్వరలోనే లాంచ్‌ చేయబోతోంది. ఇది ఢిల్లీలో 2025 భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించబోతున్నట్లు కంపెనీ యోచిస్తోంది. అయితే కంపెనీ దీనిని eVX మోడల్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. దీనిని SUV వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. అలాగే ఇది లాంచ్‌ అయితే హోండా ఎలివేట్ EVతో పాటు MG ZS EV వంటి కార్లతో పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్‌ త్వరలోనే రాబోయే టాటా కర్వ్ EVతో కూడా పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. 

60kWh బ్యాటరీ ప్యాక్:
మారుతి సుజుకి త్వరలోనే లాంచ్‌ చేయబోయే eVX కారుకు సంబంధించిన స్పెషికేషన్స్‌ను అధికారికంగా వెల్లడించలేదు. అయితే త్వరలోనే వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారు సంబంధించిన బ్యాటరీ వివరాలు మాత్రం ఇటీవలే లీక్‌ అయ్యాయి. ఇది ఎంతో శక్తివంతమైన 60kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ముందు చక్రాలు మరింత శక్తివంతంగా నడిచేందుకు ప్రత్యేకమైన ఎలక్ట్రిక్‌ మోటర్‌ను కూడా కలిగి ఉంటుంది. దీనిని పూర్తిగా ఛార్జ్‌ చేస్తే దాదాపు  550 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
LED హెడ్‌ల్యాంప్స్
పెద్ద అల్లాయ్ వీల్స్
C-పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్
ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్
టూ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్
360-డిగ్రీ కెమెరా
ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్
డ్రైవ్ మోడ్‌లు

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News