Maruti Baleno: బాలెనో పై బంపర్ ఆఫర్ ప్రకటించిన మారుతి కంపెనీ

బాలెనో కారు ప్రియులకు మారుతి కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. బాలెనో వాహనాలను మరింతగా జనాల వద్దకు తీసుకు వెళ్లడం కోసం సరికొత్త ఆఫర్‌ ను ప్రకటించింది. అదేంటంటే.. కేవలం లక్ష యాభైవేల రూపాయలు కడితే బాలనో కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 29, 2023, 01:24 PM IST
Maruti Baleno: బాలెనో పై బంపర్ ఆఫర్ ప్రకటించిన మారుతి కంపెనీ

ఇండియాలో గడచిన పదేళ్లలో కార్ల వినియోగం భారీగా పెరిగింది. ఒక వైపు తక్కువ రేటు కార్ల అమ్మకాలు పెరిగినట్లుగానే మీడియం రేంజ్ కార్ల అమ్మకాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వివిధ సంస్థలు తమ కార్లను మధ్యతరగతి వారి వద్దకు తీసుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియన్ కార్ల మార్కెట్‌ లో అత్యధికంగా మారుతి కార్లు అమ్ముడు పోతున్న విషయం తెల్సిందే. 

మారుతి సంస్థ అనేక మోడల్స్ కార్లను ప్రస్తుతం అందుబాటులో ఉంచింది. మధ్యతరగతి వారికి ఎగువ మధ్య తరగతి వారి కోసం అన్నట్లుగా మారుతి మంచి కారుగా బాలెనో ను తీసుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో స్విప్ట్‌ వాహనాల స్థాయిలో బాలెనో వాహనాలు అమ్ముడు పోతున్నాయి అంటూ మారుతి సంస్థకు చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు. 

బాలెనో వాహనాలను మరింతగా జనాల వద్దకు తీసుకు వెళ్లడం కోసం సరికొత్త ఆఫర్‌ ను ప్రకటించింది. జూన్‌ లో బాలెనో వాహనాలు 14,077 అమ్ముడు పోయినట్లుగా కంపెనీ పేర్కొంది. జులై నెలలో అంతకు మించి అన్నట్లుగా అమ్మకాలు ఉండబోతున్నాయి. మంచి ధర, మంచి మైలేజ్ తో పాటు, మంచి లుక్, ఇంటీరియర్‌ కూడా అద్భుతంగా ఉండటం వల్ల కారు కొనుగోలు చేయాలని ఆశ పడుతున్న ఎగువ మధ్యతరగతి వారు బాలెనో వైపు చూస్తున్నారు. 

ఒక రూపాయి ఎక్కువ అయినా పర్వాలేదు మంచి కారు కొనుగోలు చేయాలి అనుకునే వారు ఈ కారును కొనుగోలు చేస్తున్నట్లుగా మార్కెట్ వర్గాల వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రూ.1.5 లక్షలు డౌన్‌ పేమెంట్‌ చేసి కారును కొనుగోలు చేయవచ్చు అంటూ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయిదు సంవత్సరాల పాటు 9.8 వడ్డీ రేటుతో కారును ఇచ్చేందుకు కంపెనీ రెడీ అయింది. మొత్తంగా కారుకు 7.54 చెల్లించినట్లు అవుతుంది. ఈ మధ్య కాలంలో ఈ మొత్తం చాలా తక్కువే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Telangana, AP Rains News Live Updates: వరద బీభత్సం.. వేల ఎకరాలు జలమయం 

లక్షన్నర రూపాయలు చెల్లించి నెల నెల అయిదు సంవత్సరల పాటు 12,570 రూపాయలను చెల్లించడం ద్వారా బాలెనో కారు మీ సొంతం అవుతుంది. నిజంగా ఇది మంచి ఆఫర్ అంటూ మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 5 స్పీడ్‌ మాన్యువల్ లేదా 5 స్పీడ్‌ ఏఎంటీ ని ఈ కారులో ఇవ్వడం జరుగుతుంది. 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్ తో బాలెనో కారు వస్తుంది. 

మారుతి సుజుకి బాలెనో 360 డిగ్రీల కెమెరా, హెడ్స్ అప్ డిస్‌ ప్లే, రేర్ ఏసీ వెంట్స్ ఇంకా ఎల్ ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ను కూడా కలిగి ఉంది. రీ డిజైన్ చేయబడిన హెడ్ లైట్స్ తో మరింత సౌకర్యవంతంగా రాత్రి జర్ని సాగుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మొత్తానికి మారుతి బాలెనో గతంతో పోల్చితే చౌకగా.. మరింత ఆకర్షణీయంగా మార్కెట్‌ లో ఉంది. కనుక మీరు 8 లక్షల్లో కారు తీసుకునే ఆలోచన ఉంటే ఈ కారుకు వెళ్లొచ్చు. లక్షన్నర రూపాయలు చెల్లించి కారును మీ ఇంటికి తీసుకు వెళ్లవచ్చు. మరెందుకు ఆలస్యం వెంటనే బుక్ చేసుకోండి.

Also Read: 

Jampanna Vagu: జంపన్నవాగు మహోగ్రరూపం.. 8 మంది జలసమాధి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News