Maruti Ciaz: కేవలం లక్ష రూపాయలు చెల్లించి..మారుతి సియాజ్ ఇంటికి తీసుకెళ్లండిలా

Maruti Ciaz: ప్రముఖ కార్ల కంపెనీ మారుతి ఇటీవల సియాజ్ సెడాన్ కారుని అప్‌డేట్ చేసింది. మారుతి సియాజ్ కొనేందుకు బడ్జెట్ సహకరించడం లేదనే ఆందోళన వద్దు. కేవలం 1 లక్ష రూపాయలు చెల్లించి సియాజ్ ఇంటికి తీసుకెళ్లవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 20, 2023, 12:00 PM IST
Maruti Ciaz: కేవలం లక్ష రూపాయలు చెల్లించి..మారుతి సియాజ్ ఇంటికి తీసుకెళ్లండిలా

మారుతి కంపెనీ ఇటీవలే ప్రీమియం సెడాన్ కారైన సియాజ్‌ను ఆధునీకరించి అప్‌గ్రేడ్ చేసింది. అద్భుతమైన లుక్స్, ఫీచర్లు కలిగిన ఈ కారు ఖరీదు ఎక్కువే. అయినా కేవలం 1 లక్ష రూపాయలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లే సౌకర్యముంది. ఆ వివరాలు మీ కోసం..

మారుతి ప్రీమియం సెడాన్ విభాగంలో అత్యంత ఆదరణ పొందిన కారు మారుతి సియాజ్. ఇటీవలే ఈ కారుని కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో డ్యూయల్ టోన్ పెంట్ స్కీమ్‌తో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కొత్త స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లలో ఈ ఎస్పీ, హిల్ హోల్డ్ ఆసిస్ట్ ఉన్నాయి. ఇంతకుముందు కేవలం ఆటోమేటిక్ వేరియంట్ మాత్రమే ఉండేది. పొడుగ్గా, వెడల్పుగా ఉండే సెడాన్ కారు ఇది. చూసేందుకు అత్యంత ఖరీదైన కారుగా కన్పిస్తుంది. మీరు కూడా మారుతి సియాజ్ తీసుకోవాలనుకుంటే..బడ్జెట్ ఎక్కువౌతుందని ఆలోచించవద్దు. కేవలం 1 లక్ష రూపాయలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు. 

మారుతి సియాజ్ ధర, డౌన్ పేమెంట్

మారుతి సియాజ్ ధర 9.20 లక్షల రూపాయలతో ప్రారంభం కానుంది. 12.35 లక్షల వరకూ ఉంది. కేవలం 1 లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి ఈ కారు ఇంటికి తీసుకెళ్లవచ్చు. మారుతి సియాజ్‌లో ఉన్న వివిధ వేరియంట్ల ధర, ఈఎంఐ వివరాలు ఇక్కడ మీ కోసం ఉంచుతున్నాం. ఇందులో 10 శాతం డౌన్ పేమెంట్ , 10 శాతం వడ్డీతో పాటు 5 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది. కారు కొనుగోలు చేసేటప్పుడు ఈ మూడింటినీ అనుసరించి నిర్ణయం తీసుకోవాలి. 

మారుతి సిగ్మా మోడల్ ధర 10.27 లక్షలు కాగా పది శాతం వడ్డీ చొప్పున 5 ఏళ్ల కాల వ్యవధికి 1 లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే..నెలకు 19,688 రూపాయలు వాయిదా ఉంటుంది. అదే మారుతి సియాజ్ డెల్టా ధర 10.98 లక్షలు. 1.10 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే నెలకు ఈఎంఐ 20,956 రూపాయలుంటుంది. ఇక మారుతి జీటా మోడల్ ధర 11.76 లక్షలు. డౌన్ పేమెంట్ 1.18 లక్షలుంటే నెలకు వాయిదా 22,487 రూపాయలుంది. ఇక ఆల్ఫా ధర 12.67 లక్షలు కాగా డౌన్ పేమెంట్ 1.27 లక్షలైతే నెలకు వాయిదా అనేది24,213 రూపాయలుంటుంది. ఇక డెల్టా ఏటీ ధర 12.79 లక్షలైతే 12.72 లక్షలకు 1.27 లక్షలు డౌన్ పేమెంట్ ప్రకారం నెలకు 24,332 రూపాయలు వాయిదా ఉంటుంది. సియాస్ ఎస్ ధర 12.79 లక్షలుంది. డౌన్ పేమెంట్ 1.28 లక్షల ప్రకారం నెలకు వాయిదా 24,448 రూపాయలుంది. మారుతి సియాజ్ జీటా ఏటీ ధర 13.13 లక్షలు కాగా,1.31 లక్షలు డౌన్ పేమెంట్‌పై నెలకు 25,105 రూపాయలు వాయిదా ఉంటుంది. ఇక ఆల్ఫా ఏటీ ధర 14.03 లక్షలు కాగా 1.40 లక్షలు డౌన్ పేమెంట్ అయితే నెలకు వాయిదా 26,830 రూపాయలుంటుంది. 

మారుతి సియాజ్ మోడల్‌లో టాప్ వేరియంట్ మారుతి ఆల్ఫా ఏటీ. బేసిక్ వేరియంట్ అయితే మారుతి సిగ్మా. బేసిక్ వేరియంట్ ధర 10.27 లక్షల రూపాయలుంటే..టాప్ వేరియంట్ ఆల్ఫా ఏటీ ధర 14.03 లక్షలుంది.

Also read: 7th pay commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, మార్చ్‌లోనే డీఏ పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News